Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?
ABN, Publish Date - Apr 10 , 2026 | 09:49 PM
‘కూలీ’తో మిస్సైన సక్సెస్‌ను ‘జైలర్ 2’తో రాబట్టాలని, రజినీకాంత్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో సపోర్ట్ చేస్తున్నట్లుగా కోలీవుడ్‌లో వార్తలు వినవస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా కొన్ని రోజులుగా వార్తలలో ఉండటానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) నుంచి వచ్చిన లాస్ట్ చిత్రం ‘కూలీ’ (Coolie) అనుకున్నంతగా సక్సెస్ సాధించలేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను అలరించడంలో ఫెయిలైంది. ‘కూలీ’తో మిస్సైన సక్సెస్‌ను ‘జైలర్ 2’ (Jailer 2)తో రాబట్టాలని, రజనీకాంత్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో సపోర్ట్ చేస్తున్నట్లుగా కోలీవుడ్‌లో వార్తలు వినవస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా కొన్ని రోజులుగా వార్తలలో ఉండటానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా. ‘జైలర్’లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజాలు స్క్రీన్ మీద కనిపించగానే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఈసారి ‘జైలర్ 2’లో బాలీవుడ్ నుంచి షారుఖ్‌ని, టాలీవుడ్ నుంచి బాలయ్యని గెస్ట్ రోల్‌లో దింపాలని.. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, వారిద్దరూ ఈ సినిమాకు హ్యాండ్ ఇచ్చినట్లుగా తాజాగా టాక్ మొదలైంది. అలాగే, వారి ప్లేస్‌లో మరో స్టార్ హీరో చేస్తున్నట్లుగా ప్రచారం హోరెత్తుతోంది.
ఆ స్టార్ ఎవరో ఎవరో కాదు.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan). ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నా, షెడ్యూల్ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తే మాత్రం సినిమాలు చేస్తానని మాట ఇచ్చారు. దీంతో, షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, నిజంగా ఈ సినిమాలో పవర్ స్టార్ నటిస్తే మాత్రం.. సినిమా రేంజే మారిపోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం. నిజమే, రజినీకాంత్-పవన్ కళ్యాణ్ ఒక ఫ్రేమ్‌లో కనిపిస్తే వచ్చే కిక్కే వేరు. మరి ఆ దర్శనభాగ్యం సినీ ప్రేక్షకులకు కలుగుతుందో? లేదో? తెలియాలంటే మాత్రం.. మేకర్స్ నుంచి స్పష్టత వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.
ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తప్పుకోవడానికి కారణం, ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘కింగ్’ (King) మూవీ లుక్ రివీల్ కాకూడదనే కారణంతో పాటు, ఆ సినిమా క్రేజ్ కాపాడుకోవాలని అనుకుంటున్నారట. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారని, భవిష్యత్‌లో ఏదైనా సినిమాలో కేమియో పాత్ర ఉంటే మాత్రం కచ్చితంగా చేస్తానని షారుఖ్ మాట ఇచ్చారట. అదీ విషయం.
ఇవి కూడా చదవండి:
దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ
‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్
నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!
గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!
సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు