Khushbu: గాయపడిన పులిని.. ఇకపై సహించే ప్రసక్తే లేదు
ABN , Publish Date - Jul 14 , 2026 | 10:31 AM
తాను ఒక గాయపడిన పులిని అని ప్రముఖ సినీ నటి ఖుష్బూ అన్నారు.
తాను ఒక గాయపడిన పులిని అని ప్రముఖ సినీ నటి ఖుష్బూ (Khushbu) అన్నారు. ఆమె వ్యాఖ్యలకు మరో సీనియర్ నటి రాధిక మద్దతు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఖుష్బూ కుటుంబం, ఆమె భర్త, ఇద్దరు కుమార్తెలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో అసభ్యకరంగా విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘నేను, నా భర్త సుందర్ మా పిల్లలను ఎంతో క్రమశిక్షణ, ఆత్మగౌరవంతో పెంచాను. మా హోదాను వారు ఎన్నడూ దుర్వినియోగం చేయలేదు. నేను శాంతంగా ఉండటంతో అనేక మంది రెచ్చిపోతున్నారు. అంతమాత్రాన ఆ విమర్శలను నేను అంగీకరించినట్టు కాదు. కేవలం వ్యూస్, ఫాలోయర్స్ కోసం కొందరు సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక తల్లితో ఆటలు వద్దు. తన పిల్లలను కాపాడుకునేందుకు నేను గాయపడిన పులిని. ఇకపై సహించే ప్రసక్తే లేదు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు మరో సినీ నటి రాధిక మద్దతు ప్రకటించారు.
ALSO READ:
Dhanush: ‘డి-56’ ఆ రోజే అఫీషియల్
Mysskin: విజయ్ సేతుపతి ఒక అగ్నిపర్వతం
Shruti Haasan : శ్రుతి హాసన్ ఓ ఇంటిదయ్యింది
Indian Movies: ఆ చిత్రాల్లో అగ్రస్థానంలో 'టాక్సిక్'!
కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ