Vijay Devarakonda: అసలు నిక్కరు వేసుకుని.. పెళ్లి చేసుకుందామనుకున్నా
ABN , Publish Date - Oct 05 , 2026 | 09:59 AM
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మికల రాయల్ వెడ్డింగ్ వెనుక ఉన్న ఓ ఫన్నీ సీక్రెట్‌ను విజయ్ స్వయంగా బయటపెట్టారు.
టాలీవుడ్ మోస్ట్ అడరబుల్ కపుల్ విరోష్ జంట ఐదేళ్ల తమ రహాస్య ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టి ఈ ఏడాది ఆరంభంలో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి రణబాలి (Ranabaali) అనే సినిమాలో నటిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూవీ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆక్టోబర్ 16న ప్రేక్షకుల ఎదుటకు వస్తోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచి చిత్రాన్ని జనాలలోకి తీసుకెళ్లేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక (Rashmika Mandanna)ల రాయల్ వెడ్డింగ్ వెనుక ఉన్న ఓ ఫన్నీ సీక్రెట్‌ను విజయ్ స్వయంగా బయటపెట్టారు. తనకు ఏ ఆడంబరాలు లేకుండా సముద్రపు ఒడ్డున నిక్కరు వేసుకుని సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని ఉండేదని, కానీ అలా చేస్తే అమ్మ కొట్టి పెద్ద డ్రామా చేస్తుందనే భయంతో ఆ ఆలోచన విరమించుకున్నానని నవ్వుతూ చెప్పారు.
ఇక రష్మిక సైతం ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకుండా పెళ్లి ఏర్పాట్ల బాధ్యతను తనకే వదిలేసిందని సరదాగా పంచుకున్నారు. ఇదిలాఉంటే.. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అలాంటిది పెళ్లి నిక్కర్ వేసుకుని చేసుకోవడం ఏంటని అలా అనుకోవడం, మాట్లాడడం ఏంటి అని కామెంట్లు చేస్తున్నారు.