‘ది ప్యారడైజ్’.. ఓటీటీ వెర్షన్‌లో బిగ్ సర్ ప్రైజ్!

ABN , Publish Date - Oct 05 , 2026 | 10:52 AM

భారీ అంచ‌నాల‌తో గ‌త నెలాఖ‌రున థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ‘ది ప్యారడైజ్ సినిమా రెండో వారంలోకి అడుగు పెట్టి విజ‌య‌వంతంగా ర‌న్ అవుతుంది.

the paradise

భారీ అంచ‌నాల‌తో గ‌త నెలాఖ‌రున థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ‘ది ప్యారడైజ్ (The Paradise) సినిమా రెండో వారంలోకి అడుగు పెట్టి విజ‌య‌వంతంగా ర‌న్ అవుతుంది. నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (srikanth odela) కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించిన విషయం విధితమే. అయితే తొలిరోజే తీవ్ర నెగిటివిటీని మూట‌గ‌ట్టుకున్న ఈ చిత్రం థియేటర్ల‌లో మంచి క‌లెక్ష‌న్లనే రాబ‌డుతూ హిట్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 11 రోజుల్లో రూ.186 కోట్లు రాబ‌ట్టి బ‌డ్జెట్‌లో 97% రిక‌వ‌రీ సాధించిన‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అయితే సమయం సరిపోకపోవడంతో అనిరుధ్ అందించిన ఒక పవర్‌ఫుల్ ‘దేశం’ సాంగ్‌ను థియేటర్లలో తప్పనిసరి పరిస్థితుల్లో తీసి వేయాల్సి వచ్చిందని డైరెక్టర్ శ్రీకాంత్‌ తాజాగా వెల్లడించారు. వెండితెరపై మిస్సయిన ఆ గూస్‌బంప్స్ తెప్పించే ట్రాక్‌ను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రత్యేకంగా జోడించేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ అన్‌రిలీజ్డ్ సాంగ్‌తో పాటు ఓటీటీలోకి వచ్చే ‘ది ప్యారడైజ్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా అక్టోబ‌ర్ చివ‌ర‌న ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రానుంది.

Updated Date - Oct 05 , 2026 | 10:52 AM