'సప్త సాగరాలు సప్త గిరులు'గా తెలుగులో...
ABN , Publish Date - Oct 05 , 2026 | 02:15 PM
సూరి, నివిన్ పౌల్ ప్రధాన పాత్రలు పోషించి తమిళ చిత్రం 'ఏళు కడల్ ఏళు మలై' తెలుగులో 'సప్తసాగరాలు సప్త గిరులు' పేరుతో విడుదల కాబోతోంది.
కమెడియన్‌గా పలు చిత్రాలలో నటించిన సూరి, ఇప్పుడు హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అతని తాజా చిత్రం 'మండాడి' మంచి విజయాన్ని సాధించి, వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమాతోనే తెలుగువాడైన సుహాస్ సైతం కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అలానే మలయాళ నటుడు నివిన్ పౌలీ ఇప్పుడు సక్సెస్ ట్రాక్‌లో సాగుతున్నాడు. అతని లేటెస్ట్ మూవీ 'బెత్లేహాం కుటుంబ యూనిట్' ఏకంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. విశేషం ఏమంటే వీరిద్దరూ కీలక పాత్రలు పోషించిన తమిళ చిత్రం 'ఏళు కడల్ ఏళు మలై' ఇప్పుడు రిలీజ్ అయ్యింది.
నిజానికి చాలా కాలం క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా రకరకాల కారణాలతో విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు సూరి, నివిన్ పౌల్ సక్సెస్ ట్రాక్ లో ఉండటంతో ఈ సినిమాను అక్టోబర్ 1న తమిళంలో విడుదల చేశారు. ఇదే సినిమాను తెలుగులో 'సంచారి' పేరుతో అదే రోజు విడుదల చేయాల్సింది. కానీ అప్పటికే తెలుగులో 'సంచారి' టైటిల్ ప్రముఖ దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ్ వద్ద ఉండటంతో వివాదం చెలరేగింది. 'సంచారి' టైటిల్ ఇవ్వడానికి చంద్ర సిద్ధార్థ్ అంగీకరించకపోవడంతో... అక్టోబర్ 1న 'సంచారి' సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ఆ సినిమా తమిళ పేరునే తెలుగులో అనువదించి, 'సప్త సాగరాలు సప్త గిరులు'గా అక్టోబర్ 9న జనం ముందుకు తీసురాబోతున్నారు. రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అక్టోబర్ 1న తమిళంలో విడుదలైన 'ఏళు కడల్ ఏళు మలై' మూవీకి మిశ్రమ స్పందనే దక్కింది. సో... తెలుగువారు దీనిని ఏ మేరకు ఆదరిస్తారనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
బాక్సాఫీస్ వద్ద.. హిందీ ‘దృశ్యం 3’ సెన్సేషన్
Raaka Movie: అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌పై అదిరిపోయే అప్‌డేట్.. అట్లీ మాస్టర్ ప్లాన్
Ranabaali: స్టార్‌డమ్, ఫ్యాన్ బేస్ తగ్గలేదు.. అయినా విజయ్‌కు జీవన్మరణ సమస్య