సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kamal Haasan: దూరంగా అభిమానిస్తూ.. నేరుగా విమర్శించుకుంటూ..

ABN, Publish Date - Jan 27 , 2026 | 09:55 AM

మలయాళ మెగాస్టార్‌ మమ్ముటికి (Mammootty)కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ (Padma Bhushan) ప్రకటించిన సంగతి తెలిసిందే! దీనిపై కమల్ హాసన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది

మలయాళ మెగాస్టార్‌ మమ్ముటికి (Mammootty)కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ (Padma Bhushan) ప్రకటించిన సంగతి తెలిసిందే! అభిమానులు, దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

‘నా ప్రియమైన మిత్రుడు మమ్ముట్టి ఇప్పుడు పద్మభూషణ్‌ మమ్ముట్టిగా మారారు. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇది నాకెంతో సంతోషకరమైన వార్త. మేమిద్దరం కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. కానీ చాలా ఏళ్లుగా మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం. ఒకరి సినిమాల్ని ఒకరు క్రిటిక్స్‌గా విమర్శించుకుంటాం. మా బంధం దూరంగా అభిమానిస్తూ..నేరుగా విమ‌ర్శ‌లు చేసుకునే ‘కోప్పెరుంచోళన్–పిసిరందైయార్’ లాంటిది. మమ్ముట్టి అభిమానిగా నేను సాధారణ ఫ్యాన్స్‌ మాదిరిగానే ఆనందం వ్యక్తం చేస్తున్నా. మా సుదీర్ఘ ప్రయాణంలో చిన్న బాధ కూడా ఉంది. ‘మేమిద్దరం ఇంకాస్త ఎక్కువగా కలుసుకుని ఉండాల్సిందని ఇప్పుడు అనిపిస్తోంది. నా అభిమానులు మమ్ముటీ అభిమానులుగా కూడా ఉండాలన్నదే నా కోరిక' అని అన్నారు.  దీంతో అభిమానులు ‘ఈ అగ్ర కథానాయకుల కలయికలో సినిమా రావాలని కోరుకుంటున్నాము’ అని పోస్ట్‌లు పెడుతున్నారు. 

AlSO READ: Vijay Manoj: రణబాలి.. డేవిడ్ రెడ్డి! అటు విజ‌య్ ఇటు మ‌నోజ్‌

Chiranjeevi: పద్మశ్రీ గ్రహీతలను సన్మానించిన చిరంజీవి.. వారి ఇంటికి వెళ్లి మరీ..

Eesha Rebba: నిజంగా.. చెంపపై గట్టిగా కొట్టారు! నా కళ్లలో.. నీళ్లొచ్చాయి

Updated Date - Jan 27 , 2026 | 10:59 AM