Vijay Manoj: రణబాలి.. డేవిడ్ రెడ్డి! అటు విజ‌య్ ఇటు మ‌నోజ్‌

ABN , Publish Date - Jan 27 , 2026 | 07:35 AM

తెలుగు సినీరంగంలో బ్రిటిష్ కాలంనాటి చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటోంది.

Vijay Manoj

తెలుగు సినీరంగంలో బ్రిటిష్ కాలంనాటి చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటోంది. గతంలో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి', 'ఆర్ఆర్ఆర్', 'రజాకార్' చిత్రాలు మొదలు.. ఇటీవల విడుదలైన 'ఛాంపియన్' వరకు తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందాయి. తాజాగా ఇదే నేపథ్యంలో మరో రెండు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి.

'రణబాలి'గా విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా రాహుల్ సంకృత్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో రూపుదిద్దుకుం టున్న చిత్రం పేరును 'రణబాలి' అని ఖరారు చేశారు. ఈ మేరకు చిత్రబృందం గ్లింప్స్‌ విడుదల చేసింది. టీ సీరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

గ్లింప్స్‌లో 'రణ బాలి' అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు ఆకట్టుకుంది. కథానాయిక రష్మిక మందన్న జయమ్మగా కనిపించారు. ప్రతినాయకుడు సర్ థియోడోర్ హెక్టార్ పాత్రలో మమ్మీ ఫేమ్ నటుడు ఆర్నార్డ్ వోస్లూ (Arnold Vosloo) నటిస్తున్నాడు. 19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా 'రణబాలి' రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్‌ స్టార మ్యూజిక్ ద్వ‌యం అజ‌య్ అతుల్ సంగీతం (Ajay Atul) అందిస్తున్నారు.

G_mn_LIWMAQp1oW.jfif

'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్

మ‌రోవైపు.. 1897-1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంలో జరిగిన కథతో రూపుదిద్దుకుంటున్న 'డేవిడ్ రెడ్డి' (David Reddy) చిత్రంలో యోధుడి పాత్రలో హీరోగా మనోజ్ (Manchu Manoj) నటిస్తున్నారు. ఇందులో ఆయన గెటప్ చాలా విభిన్నంగా ఉంది. క్రూరమైన బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచి పోరాడే యోధుడిగా మనోజ్ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

రిపబ్లిక్ డే సందర్భంగా మనోజ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టెర్రఫిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మరియా ర్యబోషష్క హీరోయిన్‌గా నటిస్తోంది.

G_kRX1aX0AAzwZU.jfif

Updated Date - Jan 27 , 2026 | 07:35 AM