Chiranjeevi: పద్మశ్రీ గ్రహీతలను సన్మానించిన చిరంజీవి.. వారి ఇంటికి వెళ్లి మరీ..

ABN , Publish Date - Jan 26 , 2026 | 08:20 PM

రిపబ్లిక్ డే సందర్భంగా టాలీవుడ్ ఆనందంతో వెలిగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్ (Murali Mohan), రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం సినీ పరిశ్రమకు విశేష గౌరవంగా నిలిచింది.

Chiranjeevi

Chiranjeevi: రిపబ్లిక్ డే సందర్భంగా టాలీవుడ్ ఆనందంతో వెలిగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్ (Murali Mohan), రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం సినీ పరిశ్రమకు విశేష గౌరవంగా నిలిచింది. దీంతో అభిమానులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలందరూ విన్నర్స్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).

చిరంజీవి స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి మరీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.వారిని సాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ ముగ్గురి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణలు, జ్ఞాపకాల పంచుకోవడం.. దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించిన అనుబంధాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక సోషల్ మీడియా ద్వారా కూడా పద్మశ్రీ గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. 'ఇలాంటి విశిష్ట వ్యక్తులను సత్కరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ ధర్మజీ గారి పద్మ విభూషణ్, మమ్ముట్టీ గారు, డాక్టర్ దత్తాత్రేయుడు నోరి గారికి లభించిన పద్మ భూషణ్.. ఇవన్నీ దశాబ్దాల పాటు వారు చూపిన అంకితభావం, ప్రతిభకు దక్కిన గౌరవం. మిత్రులు మురళీ మోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సోదరుడు మాధవన్ గారు, మన చాంపియన్ రోహిత్ శర్మ, అలాగే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ లభించడం ఎంతో సంతోషంగా ఉంది. కళలు, విజ్ఞానం, వైద్యం, సాహిత్యం, క్రీడలు వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన 2026 సంవత్సరపు పద్మ అవార్డు గ్రహీతలకు నా హృదయపూర్వక అభినందనలు' తెలియజేశారు.

Updated Date - Jan 26 , 2026 | 08:59 PM