సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

jailer 2 : రజనీ అభిమానులకు ముందే వచ్చిన దీపావళి

ABN, Publish Date - Oct 16 , 2026 | 07:17 AM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌-2’ గురువారం ప్రపంచ వ్యాప్తంగా పాన్‌ ఇండియా మూవీగా విడుదలైంది. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌-2’ గురువారం ప్రపంచ వ్యాప్తంగా పాన్‌ ఇండియా మూవీగా విడుదలైంది. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. థియేటర్ల వద్ద బాణసంచా కాలుస్తూ ముందుగానే దీపావళి వచ్చినట్టుగా  సంబరాలు జరుపుకున్నారు. అలాగే, థియేటర్ల వద్ద కట్టిన భారీ కటౌట్లకు పాలాభిషేకాలు చేసి తలైవర్‌ పట్ల  తమ భక్తిని చాటుకున్నారు. పలు ఆలయాల్లో సినిమా హిట్‌ కావాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యంగా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో  తిలకించేందుకు రజనీకాంత్‌ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ నటులు థియేటర్లకు క్యూకట్టారు. కోయంబేడులోని రోహిణి థియేటర్‌కు రజనీకాంత్‌ వీరాభిమాని, మాజీ అల్లుడు హీరో ధనుష్‌ తన ఇద్దరు కుమారులు యాత్ర, లింగాతో కలిసి వచ్చి సినిమా చూశారు. అలాగే, రజనీకాంత్‌ సతీమణి లత, పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా రోహిణి థియేటర్‌కు వచ్చి అభిమానులతో కలిసి సినిమా చూశారు.

ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, నటి రమ్యకృష్ణ వెట్రి థియేటర్‌లోనూ, రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య స్థానిక జాఫర్‌ఖాన్‌ పేటలోని కాశీ థియేటర్‌లో సినిమా చూశారు. థియేటర్‌ ముందు అభిమానులతో కలిసి సౌందర్య డ్యాన్స్‌ చేశారు. అదేవిధంగా రజనీకాంత్‌తో ‘ధర్మన్‌’ సినిమా తెరకెక్కిస్తున్న యువ దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు, హీరో సూరి కూడా సినిమా చూసి ఎంజాయ్‌ చేశారు. ‘జైలర్‌-2’ సందడి  తమిళనాడులోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరితో పాటు విదేశాల్లో కూడా కనిపించింది. సినిమా విడుదలను పురస్కరించుకుని రజనీకాంత్‌ అభిమానులు ఉదయం 5 గంటలకే థియేటర్ల వద్దకు మేళతాళాలు, డీజేలతో చేరుకుని నృత్యాలు చేస్తూ, బాణాసంచా పేలుస్తూ హంగామా సృష్టించారు.

కాసాగ్రాండ్‌ ఉద్యోగుల పరుగులు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల సంతోషం గురించి చెప్పాల్సిన పని లేదు. గురువారం ఆయన నటించిన ‘జైలర్‌ 2’ విడుదల నేపథ్యంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ‘కాసా గ్రాండ్‌’.. తమ సంస్థలో పని చేసే 3500 మంది ఉద్యోగులను మొదటి షోకు పంపించింది. వివిధ నగరాల్లో పని చేస్తున్న ఉద్యోగుల కోసం ‘ఫస్ట్‌ డే ఫష్ట్‌ షో’ ప్రదర్శన  ఏర్పాటు చేసింది. 

ఇవి కూడా చ‌ద‌వండి..

వామ్మో.. స్పిరిట్, వారణాసిల‌తో.. భారతీయుడు 3 పోటీ?

రామ్ చరణ్ - సుకుమార్ సినిమాలో బ్లాస్ట్ బ్యూటీ?

Balakrishna: ఈ సారి.. 'దాదా' టార్గెట్‌ మిస్‌ అవ్వదు!

హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన వారణాసి.. ఐమాక్స్ ఛానల్‌లో నంబర్ వన్‌గా మహేష్ మూవీ!

విశాఖలో మెగాస్టార్ చిరంజీవి మల్టీప్లెక్స్.. లీక్ చేసిన ఎమ్మెల్యే

Updated Date - Oct 16 , 2026 | 07:52 AM