ఇద్దరు ఎమ్మెల్యేలతోనే అధికారం కోసం ఆరాటమా? - నటి కస్తూరి
ABN , Publish Date - May 10 , 2026 | 09:24 AM
తమిళనాడు రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన అనిశ్చిత పరిస్థితులపై నటి కస్తూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో టీవీకే (TVK) ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన అనిశ్చిత పరిస్థితులపై నటి కస్తూరి (Actress Kasthuri) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కలిగిన పార్టీలవారు సైతం అధికారం కోసం ఆరాటపడుతున్న దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొనడం శోచనీయమన్నారు. ఇలాంటి దుస్థితి రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఓటేసిన ప్రజలంతా టీవీకే ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటవుతుందా అని ఎదురుచూస్తున్నారని, ఆదివారం లోగా ఓ నిర్ణయానికి రాకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చేస్తుందన్నారు.
ఓట్ల శాతంతో పాటు సంఖ్యాబలం కలిగిన విజయ్‌కి మద్దతు ఇస్తామంటూ చిన్నాచితక పార్టీలు సైతం అధికారంలో భాగస్వామ్యం కోసం ఆరాటపడుతున్నాయని చెప్పారు. పెళ్లికి ముందే వధువు రక్తాన్ని పీల్చేలా కట్నకానుకలడిగినట్లు చిన్నపార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో కఠిన షరతులు విధించడం అన్యాయమన్నారు. వీరిని వెంటబెట్టుకుని విజయ్ ఎలా సుపరిపాలన అందించగలుగుతారని కస్తూరి ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. నటి కస్తూరి మాత్రమే కాదు.. తమిళనాడుకు చెందిన సెలబ్రిటీలెందరో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం.
మే 4న రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మే 9వ తేదీ రాత్రి వరకు తమిళనాడు పాలిటిక్స్ ఎంత రసవత్తరంగా నడిచాయో తెలియంది కాదు. ఇదిగో ఈ రోజు ప్రమాణ స్వీకారం అని, విజయ్‌ని అభిమానించే వారంతా ఎదురు చూడటం, చివరకు నిరాశకు లోనవడం జరుగుతూ వచ్చింది. ఫైనల్‌గా, అన్ని సమస్యలను పరిష్కరించుకుని, విజయ్ ఆదివారం తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి
Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!
Rao Bahadur: ‘పెద్ది’తో పోటీకి మహేష్ బాబు ‘నో’.. రిలీజ్ డేట్ మారింది!