సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సూర్య ‘సీన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

ABN, Publish Date - Nov 24 , 2026 | 01:25 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు తిరుగులేని ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత సూర్య నటించిన మూడో చిత్రం ‘సీన్’. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Scene OTT Update

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు తిరుగులేని ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత సూర్య నటించిన మూడో చిత్రం ‘సీన్’ (Scene) కూడా భారీ విజయాన్ని అందుకుని ఆయనకు హ్యాట్రిక్ హిట్‌ను అందించింది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో సూర్య సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించగా, యువ నటుడు నస్లీన్ (Naslen) విలన్‌గా, టోవినో థామస్ ప్రత్యేక అతిథి పాత్రలో (క్యామియో) అలరించారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక స్వయంగా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 6న థియేటర్లలో విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.


‘సీన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 4వ తేదీ నుంచి తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా పూర్తి కాకముందే సూర్య హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ ఓటీటీలోకి వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


‘సీన్’ కథ విషయానికి వస్తే.. డి.ఎస్.పీ. ప్రేమ్‌ రాజ్ (సూర్య) పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఒక లెజెండ్. తను టేకప్ చేసిన ప్రతి కేసునూ ఎంతో చాకచక్యంగా ఛేదించి నేరస్థులను కటకటాల వెనక్కి పంపుతుంటాడు. అలాంటి ప్రేమ్‌ రాజ్, మోస్ట్ వాంటెడ్ ‘పెర్ఫ్యూమ్ కిల్లర్’ విక్టర్‌ (టోవినో థామస్‌)ను కూడా పట్టుకుని జైలు పాలు చేస్తాడు. అయితే, ఆ తర్వాత రంగంలోకి దిగిన ఈశ్వరన్‌ (నస్లీన్‌) అనే కాంట్రాక్ట్ కిల్లర్, పోలీసులను తప్పుదారి పట్టించడానికి అచ్చం పెర్ఫ్యూమ్ కిల్లర్ తరహాలోనే రెండు హత్యలు చేస్తాడు. దీంతో అసలు నేరస్థుడిని పట్టుకోలేదన్న విమర్శలతో పాటు అందరూ ప్రేమ్‌ రాజ్‌నే అనుమానించడం మొదలుపెడతారు. వ్యక్తిగత కారణాలతో అప్పటికే ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్న ప్రేమ్‌ రాజ్, ఈ పరిణామాన్ని సవాలుగా తీసుకుంటాడు. తన మనసు మార్చుకుని, అసిస్టెంట్ మాయ (నజ్రియా) సహాయంతో ఈ కేసును మళ్లీ టేకప్ చేస్తాడు. ఈశ్వరన్ వేసే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, ప్రేమ్‌ రాజ్ అతన్ని ఎలా పట్టుకున్నాడు? అసలు ఈ హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అనేదే 'సీన్' మిగతా కథ.

ఇవి కూడా చదవండి:

RC17: రామ్ చరణ్ సరసన ఆ ‘తార’ ఫిక్స్ అయినట్టేనా?

‘దేవర’కు గ్రహణం వీడింది.. బుల్లితెరకు వచ్చే సమయం ఆసన్నమైంది

ఈ ‘ఆలోచన’ నిజంగా ఒక మంచి ఆలోచన: చిరంజీవి

Updated Date - Nov 24 , 2026 | 01:42 PM