RC17: రామ్ చరణ్ సరసన ఆ ‘తార’ ఫిక్స్ అయినట్టేనా?
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:40 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్.. ఈ పేర్లు వినగానే గుర్తొచ్చేది ‘రంగస్థలం’ చిత్రమే. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు మరో మూవీ రాబోతుంది అదే ప్రాజెక్ట్ ‘RC17’.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar).. ఈ పేర్లు వినగానే గుర్తొచ్చేది ‘రంగస్థలం’ చిత్రమే. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు మరో మూవీ రాబోతుంది అదే ప్రాజెక్ట్ ‘RC17’. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఇండియన్ సినిమా మొత్తం ఈ ప్రాజెక్ట్ వైపు ఎంతో ఆసక్తిగా చూస్తోంది. ‘పుష్ప-2’ (Pushpa 2) భారీ విజయం తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడం, మరోవైపు ‘పెద్ది’ (Peddi) తర్వాత చరణ్ ఎంచుకున్న సబ్జెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. అదే ‘RC17’లో మెయిన్ లీడ్ హీరోయిన్ ఎంపిక.
సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ అంటే కేవలం పాటల కోసమో, రొమాంటిక్ సీన్స్ కోసమో ఉండదు. కథను నడిపించే ఒక బలమైన పాత్రగా ఉంటుంది. ‘రంగస్థలం’లో రామలక్ష్మిగా సమంత (Samantha) నటన ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రతి ఒక్కరికీ స్పష్టంగా గుర్తుంది. ఇప్పుడు ‘RC17’లో కూడా హీరోయిన్ పాత్ర ఎంతో ఎమోషనల్ డెప్త్‌తో, కథలో అత్యంత కీలకంగా ఉండబోతోందట. ముందుగా ఈ రోల్ కోసం ‘పొన్నియిన్ సెల్వన్, ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్ (Sara Arjun) పేరును పరిశీలించినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఆమె గతంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. ఒక స్టార్ హీరో సరసన ఆమెను ఫుల్ లెంగ్త్ హీరోయిన్గా చూపించినప్పుడు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది..? ఎక్కడైనా చిన్న నెగెటివిటీ వస్తుందా? అన్న కోణంలో టీమ్ ఆలోచించినట్లు తెలుస్తోంది. అందుకే ఆ ప్రయోగాన్ని పక్కన పెట్టి, మరో ఫ్రెష్ ఛాయిస్ కోసం వేట మొదలుపెట్టారు. ఈ పాత్రకు నటనతో పాటు తెలుగు భాషపై మంచి పట్టు ఉండాలి, డైలాగ్ డెలివరీలో సహజత్వం కనిపించాలి. అందుకే భాష రాని పరభాషా భామల కంటే, తెలుగు మూలాలున్న ప్రతిభావంతురాలైన నటి అయితే బాగుంటుందని సుకుమార్ భావించారట. ఈ క్రమంలోనే ఆయన దృష్టి సాత్విక వీరవల్లి (Satvika Veeravalli)పై పడింది. ఇటీవల వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో తన సహజమైన నటనతో సినీ ప్రియులను, క్రిటిక్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది సాత్విక. స్క్రీన్ ప్రజెన్స్, భావోద్వేగాలను పండించే తీరు చూసి సుకుమార్ టీమ్ ఇంప్రెస్ అయినట్లు సమాచారం. చరణ్ పక్కన ఈ కాంబినేషన్ సెట్ అయితే స్క్రీన్ మీద సరికొత్త ఫ్రెష్‌నెస్ వస్తుందని మేకర్స్ నమ్ముతున్నారట.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, అతి త్వరలోనే హైదరాబాద్‌లో సాత్విక వీరవల్లికి సంబంధించి ప్రత్యేక లుక్ టెస్ట్ నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. చరణ్ సరసన ఆమె పెయిరింగ్ ఎలా ఉంటుంది? స్క్రీన్ టెస్ట్‌లో ఆమె ఎంతవరకు న్యాయం చేయగలదు? అనేది పరిశీలించిన తర్వాతే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ పూర్తి మేకోవర్‌లోకి వెళ్తున్నారు. బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి సరికొత్త లుక్‌తో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఈ కాంబో లాక్ అయితే, చాలా కాలం తర్వాత ఒక భారీ పాన్-ఇండియా స్టార్ ప్రాజెక్ట్‌లో తెలుగు మూలాలున్న అమ్మాయికి మెయిన్ లీడ్ రోల్ దక్కినట్లు అవుతుంది. ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఒక మంచి పరిణామం అనే చెప్పాలి. మరి రామ్ చరణ్ పక్కన సాత్విక వీరవల్లి జోడీ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘దేవర’కు గ్రహణం వీడింది.. బుల్లితెరకు వచ్చే సమయం ఆసన్నమైంది
ఈ ‘ఆలోచన’ నిజంగా ఒక మంచి ఆలోచన: చిరంజీవి
Sampath Nandi: ఇప్పటివరకు శర్వా బెస్ట్ చూశారు.. ఇక బీస్ట్ చూస్తారు