‘సమ్మర్ హాలీడేస్’కు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

ABN , Publish Date - Nov 27 , 2026 | 07:44 PM

స్వచ్ఛమైన నోస్టాల్జిక్ అనుభూతిని పంచుతూ ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే సమయం ఆసన్నమైంది.

Summer Holidays OTT

వేసవి సెలవులు అంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన జ్ఞాపకాలు. స్నేహితులతో ఆటలు.. అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ, సొంత ఊరి పచ్చదనం.. ఇవన్నీ మనసులో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తాయి. అలాంటి స్వచ్ఛమైన నోస్టాల్జిక్ అనుభూతిని పంచుతూ ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’ (Summer Holidays). డెబ్యూ డైరెక్టర్ శ్రీకర్ నయన్ దర్శకత్వం వహించిన ఈ ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ చిత్రం డిసెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనీ లివ్’ (Sony LIV)లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కాబోతోంది.


కథా నేపథ్యమిదే..

గోదావరి ప్రాంతంలోని ఒక అందమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. హైదరాబాద్‌కు చెందిన ఆర్.వి (అరుణ్ దేవ్) అనే బాలుడు తన వేసవి సెలవుల కోసం అమ్మమ్మ (జయసుధ) ఊరికి వెళ్లడంతో కథ మొదలవుతుంది. అక్కడ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కె.వి (రోహన్ రాయ్) అనే స్థానిక బాలుడితో అతనికి పరిచయం ఏర్పడుతుంది. వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ, ఆ ఇద్దరు చిన్నారుల మధ్య విడదీయరాని స్నేహం చిగురిస్తుంది. ఒక సాధారణ వేసవి సెలవుగా మొదలైన వారి ప్రయాణం.. నవ్వులు, చిన్నపాటి సాహసాలు, తరగతి గదికి అందని గొప్ప జీవిత పాఠాలతో ఎలా సాగిందనేది హృదయాన్ని హత్తుకునేలా చూపించారు. జీవితంలోని అత్యంత విలువైన జ్ఞాపకాలు సాధారణ క్షణాల నుండే పుడతాయని ఈ చిత్రం సున్నితంగా గుర్తుచేస్తుంది.


ఈ సినిమా ఓటీటీకి వస్తున్న సందర్భంగా దర్శకుడు శ్రీకర్ నయన్ మాట్లాడుతూ.. ‘సమ్మర్ హాలిడేస్’ బాల్యం, స్నేహం విలువను చాటిచెప్పే చిత్రం. నా మొదటి సినిమా కావడంతో ఇది నాకెప్పుడూ ప్రత్యేకం. డిసెంబర్ 4న సోనీ లివ్‌లో డిజిటల్ ప్రీమియర్ ద్వారా ఈ చిత్రం మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతుందని ఆశిస్తున్నాను. కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూసి తమ బాల్యపు జ్ఞాపకాలను నెమరువేసుకుంటారని కోరుకుంటున్నానని తెలిపారు. సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ.. పిల్లలతో కలిసి నటించడం ఎప్పుడూ ఉల్లాసకరమైన అనుభవం. వారి సహజత్వం, అమాయకత్వం ఈ సినిమాను నాకు మరింత ప్రత్యేకంగా మార్చాయి. తరాల మధ్య బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం, సోనీ లివ్ స్ట్రీమింగ్ ద్వారా కుటుంబాలన్నింటినీ ఒకచోట చేరుస్తుందని నమ్ముతున్నానని అన్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, విజిబి ఫిల్మ్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

విరాట్ కర్ణ నెక్ట్స్ ఫిల్మ్‌కు చిరు ఫిల్మ్ టైటిల్.. గ్లింప్స్ అదిరింది

బాలయ్య - కొరటాల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

మీకు యాక్టింగ్ వస్తే.. ‘ఆర్సీ17’లో నటించే ఛాన్స్.. ఇలా ట్రై చేయండి?

Updated Date - Nov 27 , 2026 | 07:44 PM

Summer Holidays: పిల్లల సినిమాలో క్రష్‌ సాంగ్!

Summer Holidays: ప్రమోషన్స్ చాలు... సినిమా రిలీజ్ చేయండి!

Summer Holidays: ‘సమ్మర్‌ హాలీడేస్‌’ నుంచి ఫ్రెండ్‌షిప్‌ ట్రీట్‌!

Summer Holidays: ‘సమ్మర్‌ హాలీడేస్‌’ .. అమ్మ సాంగ్ వచ్చేసింది..

Summer holidays: 'మన శంకర వరప్రసాద్ గారు'  ఫేమ్  ఖుషి కీలక పాత్రలో...