Summer holidays: 'మన శంకర వరప్రసాద్ గారు'  ఫేమ్  ఖుషి కీలక పాత్రలో...

ABN , Publish Date - May 19 , 2026 | 02:25 PM

ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays) అనే  బాలల చిత్రం రాబోతోంది.

ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays) అనే  బాలల చిత్రం రాబోతోంది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఫేమ్  బేబి ఖుషి (Baby kushi) కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ఖుషి పుట్టినరోజు సందర్భంగా ఈ  చిత్రం నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు.  ఖుషి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూతురి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఇందులో ఆ చిన్నారి కీలక పాత్రతో మెప్పించనుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా  గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  

Updated Date - May 19 , 2026 | 02:55 PM