సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Megaverse: ఒకే స్టేజ్‌పై చిరు, పవన్, చరణ్.. మెగావర్స్‌లో మెగా ట్రీట్

ABN, Publish Date - Oct 30 , 2026 | 05:10 PM

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా రాబోతున్న సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ‘మెగావర్స్’ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Megaverse New Update

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా రాబోతున్న సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ‘మెగావర్స్’ (Megaverse) ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆటమ్ మీడియా వెంచర్స్, SOL ప్రొడక్షన్ LLP బ్యానర్స్‌తో కలసి.. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల తన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ షోను నిర్మిస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ తారలతో చిరంజీవి జరిపే ముచ్చట్లను సరికొత్త రీతిలో ఓటీటీ ప్రేక్షకులకు అందించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్టార్ కమెడియన్లు బ్రహ్మానందం, సునీల్‌తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ వంటి హేమాహేమీలు ఈ షోలో పాల్గొంటున్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. ఇదిలా ఉండగానే.. తాజాగా ఈ షో నుంచి మెగా అభిమానుల మైండ్ బ్లాక్ అయ్యే క్రేజీ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది.


మెగా అభిమానుల చిరకాల స్వప్నాన్ని నిజం చేస్తూ.. ‘మెగావర్స్’ వేదికపై మునుపెన్నడూ చూడని ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), పవర్ స్టార్ (ఏపీ డిప్యూటీ సీఎం) పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan).. ఈ ముగ్గురూ కలిసి ఒకే స్టేజ్‌పై సందడి చేయబోతున్నారు. ‘మగధీర’, ‘సైరా’ మూవీల వేడుకల తర్వాత ఇంత సుదీర్ఘ కాలానికి ఈ ముగ్గురు మెగా హీరోలు ఒకే వేదికపై కూర్చొని మనసు విప్పి మాట్లాడటం ఇదే ప్రథమం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక రాజకీయ బాధ్యతల్లో ఉన్న నేపథ్యంలో.. చిరంజీవి తన కుమారుడు, తమ్ముడితో సాగించే సంభాషణ మరింత ప్రత్యేకంగా, ఆసక్తికరంగా మారనుందనే విషయం తెలియంది కాదు.


తమ్ముడు పవన్ కళ్యాణ్, తనయుడు రామ్ చరణ్‌తో కలిసి చిరంజీవి పంచుకోబోయే వ్యక్తిగత జ్ఞాపకాలు, తెరవెనుక జరిగిన సరదా ముచ్చట్లు, ఆసక్తికర అనుభవాలు ఈ ఎపిసోడ్‌ను పీక్స్ స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వీలును బట్టి వచ్చే వారంలోనే ఈ స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని సమాచారం. ఇక నవంబర్ మూడో వారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ షోలో.. చిరు-పవన్-చరణ్ కాంబో ఎపిసోడ్ కచ్చితంగా ఓటీటీ హిస్టరీలోనే సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వార్త తెలియడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

సీనియర్ నటి, ‘అదుర్స్’ ఎన్టీఆర్ బామ్మ కన్నుమూత

‘మెగావర్స్’లో కమల్ హాసన్ - చిరంజీవిల క్రేజీ ప్రామిస్..

Ramayana: ‘జతగూడె’.. కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం సాంగ్

Updated Date - Oct 30 , 2026 | 05:40 PM