‘మా ఆవిడ రుక్మిణి.. చాలా స్ట్రిక్ట్!’.. నితిన్ సినిమా నుంచి హీరోయిన్ పరిచయం
ABN , Publish Date - Oct 14 , 2026 | 10:55 AM
నాచురల్ స్టార్ నాని నిర్మాణంలోనితిన్ హీరోగా దండోరా ఫేమ్ మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం అలియాస్ రుక్మిణి.
నాచురల్ స్టార్ నాని నిర్మాణంలోనితిన్ (Nithiin) హీరోగా దండోరా ఫేమ్ మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం అలియాస్ రుక్మిణి (Alias Rukmini) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్ మంచి ఆదరణ దక్కించుకోగా తాజాగా ఈ సినిమా కథానాయిక పాత్రను పరిచయం చేస్తూ ఓ చిన్న వీడియో విడుదల చేశారు.
ఈ పాత్రలో బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ (Aafiya Sayed) నటిస్తుండగా టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో.. ‘మా ఆవిడ రుక్మిణి.. చాలా స్ట్రిక్ట్ అండోయ్!’ అంటూ విడుదల చేసిన ప్రచార కంటెంట్ ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాలో నితిన్ పాత్రకు, రుక్మిణి పాత్రకు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందనే ఆసక్తి పెరుగుతోంది. కాగా డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.