సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిరంజీవి ‘మెగావర్స్‌’లో సందడి చేయనున్న స్టార్స్‌ వీరేనా?

ABN, Publish Date - Nov 05 , 2026 | 08:44 PM

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా సాగే టాక్ షో రోజురోజుకూ ఆసక్తిని కలిగిస్తోంది. అందులో చిరంజీవితో నటించిన వారు, సన్నిహితులు, మిత్రులు పాలు పంచుకోనున్నారు.

Chiranjeevi Megaverse

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హోస్ట్‌గా సాగే టాక్ షో రోజురోజుకూ ఆసక్తిని కలిగిస్తోంది. అందులో చిరంజీవితో నటించిన వారు, సన్నిహితులు, మిత్రులు పాలు పంచుకోనున్నారు. ఈ లిస్టులోని పేర్లు వింటూ ఉంటే మరింత ఇంట్రెస్ట్ కలుగుతోంది. ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి నిర్వహించబోయే టాక్ షో ‘మెగావర్స్’ (Megaverse) కోసం ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ చిత్రీకరించారు. మొదటి ఎపిసోడ్‌లో స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, సునీల్, సత్య సందడి చేసినట్లుగా తెలుస్తోంది. రెండో ఎపిసోడ్‌లో ఉలగ నాయగన్ కమల్ హాసన్ పాల్గొన్నారు. త్వరలోనే మరికొన్ని ఎపిసోడ్స్ కూడా తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. వాటిలో ఓ ఎపిసోడ్‌లో అక్కినేని ఫ్యామిలీ హీరోస్ నాగార్జున, ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ కనిపిస్తారట. మరో ఎసిపోడ్‌లో దగ్గుబాటి కుటుంబానికి చెందిన వెంకటేశ్, ఆయన అన్న సురేశ్ బాబు, రానా పాల్గొంటారని సమాచారం. ఇక మెగాస్టార్ ఫ్యాన్స్‌కు కనువిందు చేసేలా ఆయన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీయమ్ పవన్ కళ్యాణ్, తనయుడు రామ్ చరణ్ పాల్గొనే ఎపిసోడ్ ఉంటుందట! చిరంజీవి టాక్ షోలో ఈ పేర్లు వింటూంటేనే ఫ్యాన్స్ ఆనందంతో చిందులు వేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ‘మెగావర్స్’ స్ట్రీమింగ్ అవుతుందా.. చూసేయాలన్న ఆత్రుతతో ఉన్నారు.


ఇప్పటికే పేర్కొన్న పేర్లన్నీ చిరంజీవితో కలసి నటించినవారు - ఆయన సన్నిహితులు, కుటుంబసభ్యులు కావడం విశేషం. చిరంజీవి నటుడు కావడానికి స్ఫూర్తిగా నిలచిన రజనీకాంత్, ఆయన పిల్లలు కూడా ఓ ఎపిసోడ్‌లో కనిపిస్తారని వినిపిస్తోంది. నాగ్‌కు చిరంజీవికి ఎంతో అనుబంధం ఉంది. అలాగే ఈ మధ్యే ‘మన శంకరవరప్రసాద్ గారు’లో వెంకటేశ్‌తో కలసి నటించారు చిరంజీవి. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య బాండింగ్ మరింత బలపడింది. ఇక చిరంజీవి తన కెరీర్ మొదట్లో కమల్ హాసన్‌తో కలసి కె. బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథకాదు’లో నటించారు. నాటి నుంచీ వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరూ ఆయన కుటుంబసభ్యులే. వీరిద్దరితోనూ చిరంజీవి తెరపై కనిపించి అలరించారు. ఇప్పుడు బుల్లితెరపై పవన్, చెర్రీతో కలసి చిరంజీవి కనిపించడం, అందులోనూ ఎవరికీ తెలియని వారి అనుబంధానికి సంబంధించిన అంశాలను చర్చించడం మరెంతో ఆసక్తి కలిగిస్తుందని చెప్పొచ్చు.


రజనీకాంత్‌తో చిరంజీవి ‘బందిపోటు సింహం, కాళి’ వంటి చిత్రాల్లో నటించారు. వీరిద్దరి మధ్య కూడా సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. పైగా చిరు చిత్రాల ఆధారంగా రూపొందిన కొన్ని రీమేక్స్‌లో రజనీకాంత్ నటించారు. అలాగే రజనీ నటించిన కొన్ని చిత్రాలు చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ అయ్యాయి. ఇలా రజనీ, చిరు బంధం సాగింది. ఇక్కడ పేర్కొన్న వారందరితోనూ చిరంజీవి గతంలోని మధురస్మృతులు నెమరువేసుకొనే అవకాశం ఉంది. అందువల్ల తప్పకుండా ఈ ఎపిసోడ్స్ అన్నీ అలరిస్తాయని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ నుంచి ఈ ‘మెగావర్స్’ స్ట్రీమింగ్ కానుండగా.. ఈ టాక్ షో ఏ రేంజ్ రేటింగ్స్ సాధిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

సుడిగాలి సుధీర్‌ GOAT ట్రైలర్ వదిలిన దుల్కర్.. ఎలా ఉందంటే?

అనిరుధ్ పెళ్లికి ఆ స్టార్ హీరోని పిలవలేదా.. కోలీవుడ్‌లో సరికొత్త రచ్చ

‘ఫలక్‌నుమా దాస్’, ‘కల్ట్’ యాక్టర్‌‌కు హీరోగా ఛాన్స్

Updated Date - Nov 05 , 2026 | 08:44 PM