సుడిగాలి సుధీర్‌ GOAT ట్రైలర్ వదిలిన దుల్కర్.. ఎలా ఉందంటే?

ABN , Publish Date - Nov 05 , 2026 | 07:22 PM

హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం GOAT. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

GOAT Movie

హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం G.O.A.T (గోట్). Greatest Of All Times అనేది ఉపశీర్షిక. కోలీవుడ్ భామ దివ్యభారతి (Divya Bharathi) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ఏషియన్‌ సినిమాస్‌ సమర్పణలో ఈ చిత్రం నవంబరు 12న థియేట్రికల్‌ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన కంటెంట్‌ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ (GOAT Trailer)ను స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) తన సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి.. చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు అందజేశారు.


ఈ ట్రైలర్ ఎలా ఉందో గమనిస్తే.. ట్రైలర్ ఫుల్-ఆన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా అదిరిపోయింది. 1983 వరల్డ్ కప్ తర్వాత ఊళ్లలో క్రికెట్ బెట్టింగులు, జూదం ఎలా పెరిగిపోయాయనే ఆసక్తికరమైన నేపథ్యంతో కథను మొదలుపెట్టి.. విలనిజం, కిడ్నాప్ డ్రామాతో పాటు సుధీర్ మార్క్ కామెడీని కలగలిపి దర్శకుడు ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూనే, అవసరమైన చోట ఊరమాస్ యాక్షన్ హీరోగా సుధీర్ వేరియేషన్స్ చూపించిన తీరు ఆకట్టుకుంది. దివ్యభారతి గ్లామర్, లియోన్ జేమ్స్ ఇచ్చిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడవ్వడంతో ట్రైలర్ ఎనర్జిటిక్‌గా సాగింది. ఓవరాల్‌గా నవ్వులు, లవ్, ఊరమాస్ యాక్షన్ అంశాలతో ఈ సినిమా సుధీర్ కెరీర్‌కు మరో పక్కా పైసా వసూల్ ఎంటర్‌టైనర్ అయ్యేలా అయితే కనిపిస్తోంది.


ఇక ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘సుడిగాలి సుధీర్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. ఆయన క్రేజ్‌కు తగ్గ కథను ఎన్నుకుని ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఆయన పాత్ర నేటి యువతకు బాగా కనెక్ట్‌ అవుతుంది. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని చెప్పగలను. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుంది. అదేంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చారు. సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని తదితరులు ఈ చిత్రంలో నటిస్తోన్న ఇతర తారాగణం.

ఇవి కూడా చదవండి:

అనిరుధ్ పెళ్లికి ఆ స్టార్ హీరోని పిలవలేదా.. కోలీవుడ్‌లో సరికొత్త రచ్చ

‘ఫలక్‌నుమా దాస్’, ‘కల్ట్’ యాక్టర్‌‌కు హీరోగా ఛాన్స్

భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ టాలెంట్.. నెట్టింట వైరల్

Updated Date - Nov 05 , 2026 | 07:22 PM

GOAT: సుడిగాలి సుధీర్ GOAT మూవీ గ్లింప్స్

GOAT: మాస్ రగ్డ్ లుక్‌లో సుడిగాలి సుధీర్.. బీజీఎమ్ అదిరింది

GOAT Movie: ఒడియమ్మ.. సుడిగాలి సుధీర్ సినిమా సాంగ్స్ భలే ఉన్నాయే

Goat Teaser: అమ్మాయిని లేపుకొచ్చి రచ్చ చేసిన సుడిగాలి సుధీర్

Goat Song: బ్యాచిలర్ బ్యూటీ ప్రేమలో మునిగితేలుతున్న సుడిగాలి సుధీర్