వీకే నరేష్ పోర్షే పనమేరా G3 కారు.. ఖరీదెంతో తెలుసా?
ABN, Publish Date - May 16 , 2026 | 05:34 PM
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న నటుడెవరయ్యా అంటే వెంటనే వచ్చే పేరు వీకే నరేష్. నటనతో పాటు వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తలలో ఉండే నరేష్.. ఇప్పుడో కారు విషయంలో బాగా వైరల్ అవుతున్నారు.
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న నటుడెవరయ్యా అంటే వెంటనే వచ్చే పేరు వీకే నరేష్ (VK Naresh). నటనతో పాటు వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తలలో ఉండే నరేష్.. ఇప్పుడో కారు విషయంలో బాగా వైరల్ అవుతున్నారు. అవును, టాలీవుడ్ సీనియర్ యాక్టర్, విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్’ అధినేత అయిన నరేశ్.. తన గ్యారేజ్‌లోకి సరికొత్త లగ్జరీ కారును ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న లగ్జరీ బ్రాండ్ పోర్షే (Porsche) సరికొత్త మోడల్ పోర్షే పనామెరా టర్బో జి3 స్పోర్ట్ (Porsche Panamera Turbo G3 Sport) కారును ఆయన కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కారు ధర, దాని ఫీచర్లు తెలిస్తే.. ఎవరైనా షాకవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..
ఈ విలాసవంతమైన స్పోర్ట్స్ కారు విలువ మార్కెట్‌లో సుమారు రూ.2.70 కోట్లకు పైనేనట. కేవలం ధరకే అలా అనుకుంటే.. దీని వేగం గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు. ఈ కారు కేవలం 4.8 సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదట. అంటే రెప్పపాటు కాలంలోనే ఇది గాలి వేగంతో దూసుకుపోతుంది. ఇంకా అత్యాధునిక ఇంటీరియర్, స్పోర్ట్స్ మోడ్ డ్రైవింగ్, ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్ వంటి మరెన్నో ప్రత్యేకతలు ఈ కారుకు ఉన్నాయని తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఈ వెర్షన్ కారు ఉన్న మొదటి వ్యక్తి నరేషే అనేలా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నరేష్ వద్ద మెర్సిడెస్ బెంచ్, రేంజ్ రోవర్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ల కార్లు ఉన్నాయనే విషయం తెలియంది కాదు. ఇక ఈ కారు డెలివరీ అయిన వీడియోను షేర్ చేసిన నరేష్.. తన కల నెరవేరింది అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘‘ఫైనల్‌గా ఒక గొప్పకారు నా గ్యారేజ్‌లోకి అడుగుపెట్టింది. నా జీవితంలోకి సరికొత్త ‘పోర్షే పనామెరా టర్బో జి3 స్పోర్ట్’ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కేవలం 4.8 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం దీని సొంతం. ఇందులో క్రోనో ప్యాకేజ్ (Chrono package), బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ (Burmester sound system) వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. వరల్డ్ పోర్షే క్లబ్‌లో భాగం కావాలనే నా చిన్ననాటి కల ఇప్పటికి నెరవేరింది’’ అంటూ నరేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కారు ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!
Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?
లవ్ - రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!