Naresh Marriage: నరేష్ పెళ్లిళ్ల మీద రాజేంద్రప్రసాద్ సంచలన కామెంట్స్

ABN , First Publish Date - 2023-03-22T16:28:53+05:30 IST

సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, నరేష్ ఇద్దరూ నందిని రెడ్డి దర్శకత్వం లో వస్తున్న 'అన్నీ మంచి శకునములే' చిత్రం లో కలిసి చేస్తున్నారు. ఈ సినిమా మొదటి సారి మీడియా ముందుకు వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాద్, నరేష్ గురించి ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు

Naresh Marriage: నరేష్ పెళ్లిళ్ల మీద రాజేంద్రప్రసాద్ సంచలన కామెంట్స్

నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వం లో వస్తున్న 'అన్నీ మంచి శకునములే' (Anni Manchi Sakunamule) చిత్రం మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చింది. ఉగాది (Ugadi) పండగ సందర్భంగా ఈ సినిమాలో అందరూ పండగ వాతావరణం తలపించేలా నటీనటులు ధోతీలు, చీరలు కట్టుకొని వచ్చారు. ఈ సినిమాలో సీనియర్ నటులు నరేష్ (VK Naresh), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కూడా వున్నారు, వాళ్లిద్దరూ కూడా ఈ ఈవెంట్ కి వచ్చారు. దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమా గురించి చెపుతూ ఈ సినిమా రెండు కుటుంబాల మధ్య జరిగే కథ అని చెప్పారు.

naresh-rajendraprasad.jpg

నరేష్ కూడా ధోతీ, లాల్చి, పైన కండువా కూడా వేసుకొని ఈ సినిమా మొదటి ప్రెస్ మీట్ కి వచ్చాడు. ఆ సందర్భంలో ఒక ప్రశ్నకు రాజేంద్ర ప్రసాద్ సమాధానం ఇస్తూ నరేష్ ని ఉద్దేశించి మాట్లాడుతూ 'వాడు కత్తి. వాడి రేంజ్ కత్తి మేము కాదు. నేను ఒర' అని చెప్పాడు రాజేంద్రప్రసాద్. ఆ తరువాత అదే సంభాషణని పొడిగిస్తూ మేము బ్రెదర్స్ మీ అని చెప్పాడు నరేష్ ని ఉద్దేశించి రాజేంద్రప్రసాద్. ఆ తరువాత నరేష్ ని చూపిస్తూ 'చూసారా వాడు ఎప్పుడూ పెళ్లికొడుకులా ఉంటాడు' అని చెపుతూ, నరేష్ ని కూడా తన దగ్గరకి రమ్మని చెప్పాడు రాజేంద్రప్రసాద్.

అదే విషయాన్ని రాజేంద్రప్రసాద్ నరేష్ ని అడిగితే, 'నేను నిత్యపెళ్లికొడుకులా వుంటాను' అని సమాధానం చెప్పాడు నరేష్. వెంటనే రాజేంద్రప్రసాద్ అవును అది చెప్పటం మర్చిపోయాను అని 'నిత్య పెళ్లికొడుకువి నువ్వు' అని వెంటనే చెప్పాడు.

naresh-rajendraprasad2.jpg

ఈమధ్యనే నరేష్, పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) వున్న వీడియోస్ ని సాంఘీక మాధ్యమం లో విడుదల చేసాడు. అందులో పెళ్లి ప్రస్తావన (Naresh Marriage) గురించి మాట్లాడేడు నరేష్. ఇప్పుడు నరేష్, పవిత్ర (NareshPavitra) కలిసే వుంటున్నారని కూడా అంటున్నారు. ఎందుకంటే వాళ్లిద్దరూ ఎక్కడెక్కడో చెట్టాపట్టాల్ వేసుకున్న వీడియోస్ సాంఘీక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి కూడా. మరి రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలు నరేష్ వివాహాల గురించి అయి ఉండాలి. అలాగే నరేష్ కి ఇది నాలుగో వివాహం అవుతుంది.

Updated Date - 2023-03-22T16:28:55+05:30 IST