Tollywood: కీలక సమయంలో సునీల్ నారంగ్ రాజీనామా!

ABN , Publish Date - May 20 , 2026 | 01:27 PM

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి సునీల్‌ నారంగ్‌ రాజీనామా చేశారు. సినిమా థియేటర్లలో పర్సంటేజ్‌ విధానమై ప్రస్తుతం వివాదం చెలరేగిన సమయంలో ఆయన రాజీనామా ప్రత్యేకతను సంతరించుకుంది.

Sunil Narang

తెలుగు చిత్రసీమ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉంది. సినిమా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య మాటల యుద్థాలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. అయితే దీని పరిష్కార మార్గం కోసం ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో 21 మందితో ఓ కమిటీ వేశారు. ఓ పక్క ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకు రావడానికి సినిమా పెద్దలు ప్రయత్నాలు చేస్తుండగా, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ లో ఓ ఊహించని కుదుపు ఏర్పడింది. గత కొన్నేళ్ళుగా అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్‌, నిర్మాత సునీల్‌ నారంగ్‌ తన పదవికి రాజీనామా చేశారు.


గతంలోనూ ఆయన ఇలానే వివాదాల సమయంలో తన రాజీనామాను సమర్పించారు. అయితే ఇప్పుడిచ్చిన రాజీనామాను పరిశీలించి, దానిని ఆమోదించినట్టు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ కార్యవర్గం తెలిపింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ, సెక్రటరీ శ్రీధర్‌ ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు. సునీల్‌ నారంగ్‌ తీసుకున్న నిర్ణయం మనసును బాధపట్టేదే అయినా కార్యవర్గం దానిని ఆమోదించినట్టు ఆయన తెలిపారు. సునీల్‌ నారంగ్‌ ఛాంబర్‌ కు చేసిన సేవలను, ఇచ్చిన సలహాలను ఎప్పటికీ మరవలేమని ఆ లేఖలో పేర్కొన్నారు. సునీల్‌ నారంగ్‌ రాజీనామాతో ఈ వ్యవహారం ఎటుకు దారితీస్తుందో చూడాలి.

letter.jpg

ఇవి కూడా చదవండి:

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ‘బ్లాస్ట్‌’ చేసేది ఆ రోజే!

నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల

Updated Date - May 20 , 2026 | 02:02 PM