మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!
ABN, Publish Date - Apr 15 , 2026 | 09:19 PM
సింగర్ మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్ బయటికి వస్తోంది. ఇందులో ఎవరిది తప్పుంది? ఎవరు ఏంటి? అనేది పోలీసులు, కోర్టులు చూసుకుంటాయి కానీ, ఈలోపు కావాల్సినంత ఆసక్తిని ఈ కేసు జనాలకు కలిగిస్తోంది.
సింగర్ మంగ్లీ (Singer Mangli) కేసులో రోజుకో ట్విస్ట్ బయటికి వస్తోంది. ఇందులో ఎవరిది తప్పుంది? ఎవరు ఏంటి? అనేది పోలీసులు, కోర్టులు చూసుకుంటాయి కానీ, ఈలోపు కావాల్సినంత ఆసక్తిని ఈ కేసు జనాలకు కలిగిస్తోంది. ఈ కేసు విషయంలో సింగర్ మంగ్లీ అండ్ టీమ్‌పై మైక్రో ఫైనాన్స్ పేరిట భారీగా మోసం చేశారని.. మొదట న్యాయవాది సుబ్బారావు (Subbarao) కొన్ని ఆరోపణలు చేస్తూ, పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన అనంతరం సింగర్ మంగ్లీ మీడియా ముందుకు వచ్చి, తనకేం తెలియదని, ఆ సుబ్బారావు అనే అతనే, బిగ్ బాస్‌కు వెళ్లే క్రమంలో ఫేమస్ అయ్యేందుకు ఇదంతా చేస్తున్నాడనేలా, ఆమె వెర్షన్ వినిపించారు. దీంతో, అసలేం జరుగుతోందో? అని అంతా కన్ఫ్యూజన్‌లో పడిపోయారు.
ఆ తర్వాత న్యాయవాది సుబ్బారావును స్టేషన్‌కు పిలిచినప్పుడు, ఆయనకు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో పాజిటివ్ (తక్కువ మోతాదులోనే) రావడంతో, ఈ కేసులో న్యూ ట్విస్ట్ ఏర్పడింది. ఒక్కసారిగా మంగ్లీ చెప్పేవన్నీ నిజమే అనుకునేలా పరిస్థితులు మారిపోయాయి. ఈ చర్యలను అవమానకరంగా భావించిన సుబ్బారావు, మరో ప్లాన్‌ను అమలు చేశారు. సింగర్ మంగ్లీ స్కామ్‌లోని బాధితులను రంగంలోకి దింపారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. బాధితులు నేరుగా మీడియా ముందుకు రావడం, వారి బాధను తెలియజేయడంతో.. సింగర్ మంగ్లీకి సుబ్బారావు షాక్ ఇచ్చినట్లయింది.
ఇక బాధితులు మీడియా ముందు మాట్లాడుతూ.. గత ఆరు నెలల నుంచి ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, ఎక్కడికి వెళ్లాలో తెలియక చివరకు అడ్వొకేట్ సుబ్బారావును ఆశ్రయించామని బాధితులు తమ గోడును వినిపించారు. సింగర్ మంగ్లీ ఈ విషయంలో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడంపై స్పందిస్తూ, మంగ్లీకి ఉన్న హోదా వల్ల ఆమె మాటలకు ప్రాముఖ్యత లభిస్తోందని, కానీ తాము సామాన్య గృహిణులమని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్‌వర్క్ మార్కెటింగ్ పేరుతో మధు అనే వ్యక్తి తమకు పరిచయమయ్యాడని, ఐదు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయామని ఓ బాధిత మహిళ తెలిపారు. మంగ్లీ సోదరిని వివాహం చేసుకోబోతున్న వ్యక్తి ద్వారానే ఈ పెట్టుబడి వివరాలు తెలిశాయని ఆమె పేర్కొంది. ప్రారంభంలో 5 శాతం లాభం ఇస్తామని నమ్మబలికి, ఆ తర్వాత ల్యాండ్ ఇస్తామని చెప్పి తమను నమ్మించారని బాధితురాలు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
జూన్‌లోనే ‘పెద్ది’.. అధికారిక ప్రకటన వచ్చేసింది
మొన్న చరణ్.. ఇప్పుడు వరుణ్.. ‘బరి’ ప్రాక్టీస్ సెషన్‌లో ప్రమాదం