Singer Mangli: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. సింగర్ మంగ్లీపై కేసు
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:54 PM
టాలీవుడ్‌లో సినీ ఇండస్ట్రీలో మరోసారి కలకలం చోటు చేసుకుంది.
టాలీవుడ్‌లో సినీ ఇండస్ట్రీలో మరోసారి కలకలం చోటు చేసుకుంది. ఇప్పటికే డ్రగ్స్, రేవ్ పార్టీ వార్తలతో చాలాకాలం మీడియాలో ప్రధాన వార్తగా నిలుస్తూ వస్తున్న టాలీవుడ్ మరోసారి అలాంటి వార్తలతో చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ (Singer Mangli) బర్త్‌డే పార్టీ చేవెళ్ల సమీపంలోని ఈర్లపల్లి త్రిపుర రిసార్ట్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు సన్నిహితులు సినిమా ఇండస్ట్రీ వాళ్లు సుమారు 50 మంది ఈ వేడుకల్లో పాల్గొనగా ఆహుతులకు మందు పార్టీ ఏర్పాటు చేసింది.
ఈక్రమంలో అర్ధరాత్రి రెండు గంటల తర్వాత SOT పోలీసులు రిసార్ట్‌పై దాడి చేసి అనుమతి లేని విదేశీ మద్యం సీజ్ చేశారు. అంతేగాక పార్టీలో పాల్గొన్న వారిలో 48 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 9 మందికి గంజాయి పాజిటివ్ అని తేలడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్టపై చేవెళ్ల పీఎస్‌లో NDPS (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ పార్టీలో సినీ పరిశ్రమకు చెందిన దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి వంటి పలువురు సెలెబ్రిటీలు హాజరైనట్లు సమాచారం. అయితే ఈ వీడియో చిత్రీకరిస్తున్న పోలీసుపై వీడియో బంద్ చేయండి అంటూ సింగర్ మంగ్లీ సీరియస్ అయింది.