Singer Mangli: మంగ్లికి తృటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Mar 18 , 2024 | 10:55 AM

హస్కీ వాయిస్‌తో  సంగీత ప్రియులను అలరిస్తున్న సింగర్‌ మంగ్లీ (Singer mangli) ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుని ఓ డీసీఎం వ్యాన్‌ ఢీ కొట్టింది.

Singer Mangli: మంగ్లికి తృటిలో తప్పిన ప్రమాదం


హస్కీ వాయిస్‌తో  సంగీత ప్రియులను అలరిస్తున్న సింగర్‌ మంగ్లీ (Singer mangli) ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుని ఓ డీసీఎం వ్యాన్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లికి చిన్న గాయాలైనప్పటికీ సురక్షితంగా బయటపడింది. శంషాబాద్‌ తొండుపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనం లో తాజాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది.

దీనికి హాజరైన మంగ్లి.. అర్థరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా తొండుపల్లి బ్రిడ్జి దగ్గర కర్ణాటకు చెందిన డీసీఎం వ్యాన్‌ వేగంగా వచ్చి.. మంగ్లి కారుని బలంగా ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో మంగ్లితో పాటు ఉన్న మేఘరాజ్‌, మనోహర్‌ అనే వ్యక్తులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లి ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం కాస్త దెబ్బతింది. అయితే డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

Updated Date - Mar 18 , 2024 | 10:56 AM