సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సమంతకు కవల పిల్లలా.. ఆ హీరోయిన్ అలా కామెంట్‌ చేశారేంటి?

ABN, Publish Date - Oct 30 , 2026 | 09:54 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన జీవితంలో సరికొత్త, మధురమైన అధ్యాయాన్ని ఆస్వాదిస్తున్నారు. దర్శకుడు రాజ్ నిడిమోరుతో గతేడాది డిసెంబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమె, ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉన్నారు.

Samantha 9th Month Pregnancy

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం తన జీవితంలో సరికొత్త, మధురమైన అధ్యాయాన్ని ఆస్వాదిస్తున్నారు. దర్శకుడు రాజ్ నిడిమోరుతో గతేడాది డిసెంబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమె, ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉన్నారు. ఈ ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఏమాత్రం ఫిట్‌నెస్‌ను వీడకుండా, వర్కౌట్ చేస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మొదటి నెల నుంచి 9వ నెల వరకు సాగిన తన వర్కౌట్ జర్నీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ది ఫైనల్ ల్యాప్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు సమంత పెట్టిన వీడియో కంటే కూడా.. ఆ పోస్ట్‌కు ఓ హీరోయిన్ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు, క్రేజీ గాసిప్‌కు తెరలేపింది.


సమంత వర్కౌట్ వీడియో చూసిన తోటి నటి కృతి కర్బందా (‘తీన్‌మార్’ ఫేమ్) స్పందిస్తూ.. ‘‘సెండింగ్ ఆల్ 3 ఆఫ్ యూ సో మచ్ లవ్!’’ (Sending all 3 of you so much love!) అంటూ ప్రేమను కురిపించారు. సాధారణంగా దంపతులకు పుట్టబోయే బిడ్డ కలిపి ‘ముగ్గురు’ అంటారని కొందరు భావిస్తున్నప్పటికీ.. నెటిజన్లు మాత్రం ఈ కామెంట్‌ను మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. ఈ పోస్ట్‌లో కనిపిస్తున్నది కేవలం సమంత మాత్రమే.. భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru) వీడియోలో లేరు. అలాంటప్పుడు సమంతకు మాత్రమే పెట్టిన కామెంట్‌లో ‘ఆల్ 3 ఆఫ్ యూ’ అని ఎందుకు పేర్కొన్నారు? సమంత కడుపులో ఉన్నది ఇద్దరు పిల్లలా? అంటే సమంతకు కవల పిల్లలు పుట్టబోతున్నారా? అనే సరికొత్త అనుమానాలు, గాసిప్స్ మొదలయ్యాయి.


సమంతకు అత్యంత సన్నిహితమైన వారికి మాత్రమే తెలిసిన ఆ గుడ్ న్యూస్‌ను కృతి కర్బందా (kriti kharbanda) ఇలా పొరపాటున కామెంట్ రూపంలో బయటపెట్టేశారా? అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో సీమంతం వేడుకలు గ్రాండ్‌గా జరుపుకున్న ఈ జంట.. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. మరి కృతి కర్బందా చేసిన ఆ ‘ఆల్ 3’ కామెంట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? నిజంగానే సమంత డబుల్ ధమాకాతో కవలలకు జన్మనివ్వబోతున్నారా? లేక ఇది సాధారణ మాటల సందర్భమేనా? అన్నది తెలియాలంటే సమంత స్వయంగా గుడ్ న్యూస్ చెప్పేంత వరకు వేచి చూడాల్సిందే!

ఇవి కూడా చదవండి:

బాలయ్య, కొరటాల సినిమా... ఆ రూమర్స్ నమ్మొద్దంటోన్న టీమ్

Ramayana: శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది

కమెడియన్ వడివేలు 100 కోట్ల భవంతిని చూశారా.. ‘హౌస్ టూర్’ వీడియో వైరల్

Updated Date - Oct 30 , 2026 | 09:54 PM