Samantha : చిన్నప్పటి జ్ఞాపకం.. అభిప్రాయం మాత్రం మారలేదు!

ABN , First Publish Date - 2023-09-24T16:08:06+05:30 IST

మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత సినిమాలకు కాస్త విరామం తీసుకుని ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ప్రస్తుతం ఆమె ట్రావెలింగ్‌పై దృష్టిపెట్టారు. చిన్ననాటి నుంచి చూడాలనుకున్న ప్రాంతాలను ఓ రౌండ్‌ వేస్తున్నారు. తాజాగా ఆమె ఆస్ర్టియాలోని సాల్జ్‌బర్గ్‌ వెళ్లారు.

Samantha : చిన్నప్పటి జ్ఞాపకం.. అభిప్రాయం మాత్రం మారలేదు!

మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత (Samantha) సినిమాలకు కాస్త విరామం తీసుకుని ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ప్రస్తుతం ఆమె ట్రావెలింగ్‌పై దృష్టిపెట్టారు. చిన్ననాటి నుంచి చూడాలనుకున్న ప్రాంతాలను ఓ రౌండ్‌ వేస్తున్నారు. తాజాగా ఆమె ఆస్ర్టియాలోని సాల్జ్‌బర్గ్‌ వెళ్లారు. అక్కడ తనకెంతో ఇష్టమైన లొకేషన్స్‌ను వెళ్లి అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘‘చిన్నతనంలో ఎప్పుడైనా ఎక్కువ ఆనందం వచ్చినా, బాధ కలిగినా ‘సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ చిత్రాన్ని చూస్తూ ఉండేదాన్ని. దానికి వల్ల ఆ ప్రపంచం నుంచి దూరంగా వెళ్లిన భావన కలిగేది. వాస్తవానికి అదొక అద్భుత ప్రపంచంలోకి నన్ను తీసుకువెళ్లేది. నా వరకూ ఇదొక ఆధ్యాత్మిక ప్రదేశం. మామూలుగా ఒక చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూేస్త దానిపై మన ఒపీనియన్‌ మారుతూ ఉంటుంది. కానీ, ఈ చిత్రం విషయంలో చిన్నప్పటి నుంచీ ఇప్పటికీ నా అభిప్రాయం మారలేదు. నా చిన్ననాటి రోజులను గుర్తుచేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆ సినిమా లొకేషన్స్‌ను సందర్శించడం నన్నెంతో భావోద్వేగానికి గురి చేస్తోంది’’ అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ‘ఖుషి’ చిత్రంతో ఆకట్టుకున్న ఆమె ‘సిటడెల్‌’ తదితర చిత్రాల షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఆ తర్వాతే వర్క్‌ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2023-09-24T16:08:06+05:30 IST