Renu Desai: అప్పుడు ఏమైంది మీ మగతనం.. రేణు దేశాయ్ ఉగ్రరూపం

ABN , Publish Date - Jan 19 , 2026 | 05:02 PM

నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ తో విడిపోయాకా.. సినిమాలకు దూరమైన రేణు నెమ్మదిగా రీఎంట్రీ ఇస్తుంది.

Renu Desai

Renu Desai: నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ తో విడిపోయాకా.. సినిమాలకు దూరమైన రేణు నెమ్మదిగా రీఎంట్రీ ఇస్తుంది. ఇక గత కొంతకాలంగా రేణు.. మూగజీవాల కోసం ఒక NGO నడుపుతున్న విషయం తెల్సిందే. వాటిని ఎవరైనా వేధించినా.. హింసించినా రేణు అస్సలు క్షమించదు. ఆ మూగజీవాల కోసమే ఆమె ఎంతో డబ్బును ఖర్చుపెడుతుంది. ఇక గత కొన్ని నెలలుగా కుక్కల వలన చిన్నారులు మృత్యువాత పడుతున్న విషయం తెల్సిందే. ఇక దీనిపై సుప్రీంకోర్టు కుక్కలను ప్రత్యేకమైన కేంద్రాలకు తరలించాలని తెలిపింది.

ఇక సుప్రీంకోర్టు తీర్పుపై రేణు దేశాయ్ అసహనం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు జడ్జి కుక్కలపై పగతోనే అలాంటి తీర్పు ఇచ్చినట్లు తెలిపింది. ఇలా మాట్లాడినందుకు తనను జైల్లో పెట్టినా పర్లేదు అని, తాను ఏం చేయాలో అదే చేస్తానని చెప్పుకొచ్చింది. 'కుక్క కరిచింది అని చిన్నారి చనిపోతే.. ఆ కుక్కను కొట్టి కొట్టి చంపుతున్నారు. మరి ఒక చిన్నారిని రేప్ చేసి చంపేస్తుంటే అతనిని ఎందుకు చంపడం లేదు. అప్పుడు ఏమైంది మీ మగతనం.. ? ఆ రేప్ చేసిన చిన్నబిడ్డ ప్రాణం.. ప్రాణం కాదా.. ? .. విలేజ్ లో ఎక్కడా తప్పు జరగడం లేదా. మందు తాగి ఒకడు.. భార్యను, పిల్లలను కొడుతున్నాడు. అప్పుడు ఏమైంది మీ మగతనం.. ? న్యాయం ఎందుకు కొన్ని విషయాలలోనే జరుగుతుంది. అదే నేను అడుగుతున్నాను.

నేను కుక్కలు, మేకలు గురించి మాట్లాడడం లేదు.. మనుషుల గురించే మాట్లాడుతున్నాను. రోజు చాలామంది చిన్నారులు ఆకలితో చనిపోతున్నారు.. వారిది ప్రాణం కాదా.. ? హెల్మెట్ లేకుండా ఎంతోమంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు వారివి ప్రాణాలు కాదా.. కేవలం కుక్క చంపిన చిన్నారిదే ప్రాణమా.. ? విలేజ్ లో మందు తాగి గొడవలు చేస్తారు.. ఆ మందు షాపులను మూసేసే దమ్ము మీకు ఉందా.. ? కానీ, ఒక కుక్కను చంపడానికి దమ్ము ఉంది. మీకు అంత ప్రేమ ఉంటే ఆ కుక్కలను ఇంటికి తీసుకెళ్లండి అని అంటున్నారు.. గుడుల ముందు పేదవాళ్లకు డబ్బులు వేస్తారు. మరి అంత ప్రేమ ప్రేమ ఉంటే ఎందుకు వారిని ఇంటికి తీసుకెళ్లడం లేదు. వారికి ఫుడ్ ఎందుకు పెట్టడం లేదు.

మనుషుల ప్రాణాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. కుక్క మీద కోపం పెట్టుకొని వాటిని మాత్రమే చంపుతున్నారు. ఐదు కుక్కలు కరిస్తే అన్ని కుక్కలను చంపేస్తారు. అలాగే కొందరు మగాళ్లు రేప్ చేస్తే, హత్యలు చేస్తే… అందరూ మగాళ్లు రేపిస్టులు, మర్డరర్లు అవుతారా? వ్యక్తిగత నేరాలకు వ్యక్తులే బాధ్యత వహించాలి, ఒక వర్గాన్ని మొత్తం నిందించడం సరైంది కాదు.. అంటూ రేణు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Jan 19 , 2026 | 05:02 PM