Renu Desai: 'అత్త' అవుతున్న రేణు దేశాయ్

ABN , Publish Date - Nov 28 , 2025 | 02:00 PM

రేణు దేశాయి మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌. నటిగా, దర్శకురాలిగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఎడిటర్‌, ప్రొడ్యూసర్‌ ఇలా పలు శాఖలపై ఆమెకు పట్టున్న సంగతి తెలిసిందే!

రేణు దేశాయి (Renu Desai) మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌. నటిగా, దర్శకురాలిగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఎడిటర్‌, ప్రొడ్యూసర్‌ ఇలా పలు శాఖలపై ఆమెకు పట్టున్న సంగతి తెలిసిందే! హీరోయిన్‌గా కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాక దర్శకురాలిగా మారి ‘ఇష్క్‌ వాలా లవ్‌’ సినిమా తీశారు. ‘మంగళాష్టక్‌ వన్స్‌ మోర్‌’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆమె కొన్నాళ్ల క్రితం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమాలతో బిజీ కావాలని ఆమె కోరుకుంటున్నారు. నటిగా బిజీ కావడమే కాకుండా దర్శకురాలిగానూ సత్తా చాటాలనుకుంటున్నారు. ప్రస్తుతం కథలు రాసే పనితో ఉన్నారు. అయితే నటనపై  కూడా ఆసక్తి పెంచింది. అయితే సరైన పాత్ర సూట్‌ కావడం లేదు.


రవితేజ నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో హేమలత లవణం క్యారెక్టర్‌ చేశారు. ఆ సినిమా పరాజయం కావడంతో ఆ పాత్ర ఇంపాక్ట్‌ బయటకు రాలేదు. ఇప్పుడు ఆమె మరోసారి తెరపై కనిపించనుంది. నిర్మాత డి.ఎస్‌. రావు కుమారుడు సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘16 రోజుల పండగ’ (16 Rojula Panduga). వినాయకుడు ఫేం సాయికిరణ్‌ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం మొదలైంది. ఇందులో రేణు దేశాయి అత్త పాత్రలో కనిపించనున్నారు.  ‘ఫస్ట్‌ టైం అత్త రోల్‌ చేస్తున్నాను. నా వయసుకి సరిపోతుందా అనిపించింది. కానీ దర్శకుడు చెప్పినతీరు నచ్చి అంగీకరించా. నా పాత్రను ఆడియన్స్‌ కొత్తగా ఫీలవుతారు’ అని రేణు చెప్పారు. 

Updated Date - Nov 28 , 2025 | 02:14 PM