Mega Family: మదర్స్ డే.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ విషెస్ వైరల్!

ABN , Publish Date - May 10 , 2026 | 01:37 PM

‘కనిపించే దైవం కూడా ‘కని పెంచిన’ మాతృమూర్తి తర్వాతే’.. అని మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఆయనతో పాటు అన్నా కొణిదెల, లావణ్య త్రిపాఠి చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

Mega Family Mother's Day Wishes

‘కనిపించే దైవం కూడా ‘కని పెంచిన’ మాతృమూర్తి తర్వాతే’.. అని మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). మాతృదినోత్సవం స్పెషల్‌గా మెగా ఫ్యామిలీ మెంబర్స్ మెగాస్టార్ చిరంజీవి, అన్నా కొణిదెల, లావణ్య త్రిపాఠి కొణిదెల చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. (Mega Family Mother’s Day Wishes)

‘‘అమ్మ… మన మొదటి గురువు, మన మొదటి ధైర్యం, కనిపించే దైవం కూడా ‘కని పెంచిన’ మాతృమూర్తి తర్వాతే! మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. Happy Mother’s Day’’ - మెగాస్టార్ చిరంజీవి


‘‘19 ఏళ్లకే తల్లులైన వారికి, 40 ఏళ్ల వరకు వేచి చూసి తల్లైన వారికి.. సహజంగా బిడ్డలకు జన్మనిచ్చిన మహిళలకు, ఐవిఎఫ్ (IVF), ఇంజెక్షన్లు, వెయిటింగ్ రూమ్‌లు, గుండె కోతలను భరిస్తూ పోరాడి తల్లులైన మహిళలకు..ఇంట్లోనే ఉండి పిల్లలను పెంచుతున్న తల్లులకు, మోయలేని అపరాధ భావాన్ని మోస్తూనే తిరిగి ఉద్యోగాలకు వెళ్తున్న తల్లులకు.. ఒంటరిగా పిల్లలను పెంచుతున్న మహిళలకు.. తమలోని గాయాలను తామే మాన్పుకుంటూ, మరో ప్రాణాన్ని ఎంతో సున్నితంగా పెంచడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు.. బిడ్డను కోల్పోయిన తల్లులకు.. గర్భస్రావం జరిగి మనసు ముక్కలైనా, లోకం తన పని తాను చేసుకుపోతుంటే భారంగా బతుకుతున్న మహిళలకు.. ఎప్పటికైనా అమ్మ కావాలని కలలు కంటున్న మహిళలకు.. మరియు దత్తత తీసుకునేంతటి గొప్ప మనసున్న మహిళలకు.. మహిళగా ఉండటానికి ఒక్కటే మార్గం అంటూ ఏమీ లేదు.


అలాగే తల్లిగా ఉండటానికి కూడా ఇది ఒక్కటే మార్గం అని ఎక్కడా లేదు. ప్రతి మాతృత్వం వెనుక ఎన్నో త్యాగాలు, భయాలు, బలం, అలసట, ప్రేమ.. ఇలా ప్రపంచం గుర్తించని వెయ్యి అదృశ్య భావాలు దాగి ఉన్నాయి. ఈ రోజు కేవలం పరిపూర్ణత గురించి కాదు.. మహిళలు తమ గుండెల్లో మోస్తున్న ప్రతి భావానికి ఇచ్చే గౌరవం! అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు!’’ - అన్నా కొణిదెల (Anna Konidela)


‘‘నా ఉనికి మాత్రమే కాదు.. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే. మాకు నువ్వే ఒక భరోసా, దేవుడిచ్చిన గొప్ప వరం.. మా సర్వస్వం నువ్వే. మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మ!’’ - లావణ్య కొణిదెల త్రిపాఠి (Lavanya konidela Tripathi)

ఇవి కూడా చదవండి:

‘అండర్‌ రేటెడ్‌’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్‌ సమాధానమిదే!

Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!

త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి

Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

Updated Date - May 10 , 2026 | 01:59 PM