‘ఐక్య ధైర్య సేన సమితి’.. బర్త్‌డే స్పెషల్‌గా మంచు మనోజ్ షాకింగ్ నిర్ణయం!

ABN , Publish Date - May 17 , 2026 | 06:49 PM

తన పుట్టినరోజు సందర్భంగా ‘రా కింగ్’ మనోజ్ మంచు, ఆయన భార్య మౌనిక భూమా మంచు సంచలన ప్రకటన చేశారు. ఆదివారం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో జరిగిన సమావేశంలో తమ కొత్త సామాజిక సేవా సంస్థను ప్రకటించారు.

Aikya Dhairya Sena Samithi Announcement

తన పుట్టినరోజు సందర్భంగా ‘రా కింగ్’ మనోజ్ మంచు (RawKing Manoj Manchu), ఆయన భార్య మౌనిక భూమా మంచు (Mounika Bhuma Manchu) సంచలన ప్రకటన చేశారు. ఆదివారం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో రక్తదాన శిబిరం నిర్వహించిన అనంతరం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మనోజ్ దంపతులు.. తమ కొత్త సామాజిక సేవా సంస్థ ‘ఐక్య ధైర్య సేన సమితి’ (AIKYA DHAIRYA SENA SAMITHI)ని అధికారికంగా ప్రారంభించారు. ‘Unity, Courage, Service, Impact’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ (Jubilee Hills MLA Naveen Yadav)తో పాటు పలువురు అభిమానులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తనకు ఈ ఆలోచన ఎలా, ఎందుకు వచ్చిందో మనోజ్ తెలియజేశారు.


‘‘సమాజానికి అండగా నిలబడటం, సేవ చేయడం అనేది నేను, నా భార్య మౌనిక మా పెద్దల నుంచి నేర్చుకున్న విలువలు. ఇంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. కానీ అదే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదిక ఉండాలని ఈ సంస్థను ప్రారంభిస్తున్నాం. ఈ సంస్థ పేరు ‘ఐక్య ధైర్య సేన సమితి’ని మా సోదరుడు, సన్నిహితుడు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ముందుగా ఈ ఆలోచనకు మూలమైన మౌనిక భూమా మంచు గురించి చెప్పాలి. ఈ ఆలోచన నిజంగా ఆమె నుంచే వచ్చింది. రక్తదాన శిబిరంతో పాటు, ఈరోజు నుంచే ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది ఇక్కడితో ఆగదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి ఈ సేవా కార్యక్రమాలను విస్తరిస్తాం. ఈ సంస్థ ద్వారా ఎవరికైనా నిజమైన సహాయం అందితే, అదే మా జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం’’ అని మంచు మనోజ్ తెలిపారు.


మౌనిక భూమా మంచు మాట్లాడుతూ.. మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో నేను, మనోజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మా తల్లిదండ్రులు, పెద్దల ఆశీర్వాదాల వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైంది. రక్తదాన కార్యక్రమాలకే కాకుండా మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై కూడా ఈ ట్రస్ట్ పనిచేస్తుంది. ‘నమస్తే వరల్డ్’ అనే సంస్థను కూడా ప్రారంభించాం. దాని ద్వారా టాయ్ మేకింగ్ కోర్సుల సహకారంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సమాజానికి సేవ చేయడానికి ఇంకా ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. మా ట్రస్ట్‌ను ప్రారంభించిన నవీన్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.


‘ఐక్య ధైర్య సేన సమితి’ పేరును ప్రకటించి, సామాజిక సేవ కోసం ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్న మనోజ్, మౌనికలను అభినందించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌. ఆయన మాట్లాడుతూ.. మనోజ్ మంచు అన్న అభిమానులకు ప్రత్యేక అభినందనలు. మా కుటుంబం, మనోజ్ అన్న కుటుంబానికి 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచే ఆయనలో సేవా భావం ఉంది. పుట్టినరోజు సందర్భంగా మౌనిక భూమా మంచు ఆలోచనతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించడం ఎంతో అభినందనీయం. ఈ ట్రస్ట్ పేరు ‘ఐక్య ధైర్య సేన సమితి’. దీని నినాదం Unity, Courage, Service, Impact. ఆ పేరు వాళ్ల ఆలోచన, సేవా భావాన్ని ప్రతిబింబిస్తుంది. పిల్లలను దత్తత తీసుకోవడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి నిర్ణయాలు ఎంతో గొప్పవి. ఈ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల అంతటా తీసుకెళ్లేందుకు మనోజ్ అన్నకు నా పూర్తి సహకారం ఉంటుంది. ఈ సంస్థలో పనిచేసే ప్రతి వాలంటీర్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

లేటు వ‌య‌సులో ఖ‌రీదైన 'పోర్షే' ల‌గ్జ‌రీ కారు.. సీనియ‌ర్ న‌రేశ్ జ‌ల్సానే జ‌ల్సా! ఖరీదెంతో తెలుసా?

Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?

Updated Date - May 17 , 2026 | 06:49 PM