ఇళయరాజా ఆస్థాన గిటారిస్ట్ సదా మాస్టర్ కన్నుమూత
ABN, Publish Date - Oct 29 , 2026 | 01:06 PM
ప్రముఖ గిటార్ విద్వాంసుడు సదా మాస్టర్ కన్నుమూశారు. ఇళయరాజా సంగీత బృందంలో 40 ఏళ్లకు పైగా ప్రధాన గిటారిస్ట్‌గా పనిచేసిన ఆయన మృతితో సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది.
సినీ సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతుడైన ప్రముఖ గిటార్ విద్వాంసుడు ఎస్. సదానందం (సదా మాస్టర్) అక్టోబర్ 29, గురువారం ఉదయం కన్నుమూశారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం కుమారుడైన సదానందం, దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత గుర్తింపు పొందిన గిటారిస్టులలో ఒకరు. 1947 సెప్టెంబర్ 30న ఆయన జన్మించారు.
సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీత బృందంలో ఆయన దాదాపు 40 ఏళ్లకు పైగా ప్రధాన గిటారిస్ట్‌గా పనిచేశారు. ఇళయరాజా మొదటి సినిమా 'అన్నకిళి' నుంచి మొదలుకొని వేలాది ఆల్ టైమ్ హిట్ సాంగ్స్‌కు సదా మాస్టర్ గిటార్ వాయించారు. ఇళయరాజా స్వరకల్పన చేసిన ఎన్నో క్లాసిక్ సాంగ్స్ ఆయన గిటార్ నోట్స్‌తోనే ప్రాణం పోసుకున్నాయని చెప్పొచ్చు.
సదా మాస్టర్ ఆకస్మిక మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయనీగాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా దిగ్భ్రాంతిని ప్రకటించి, నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నిర్మాత కన్నుమూత
‘ఆదర్శకుటుంబం’లో టెన్షన్.. అసలు విషయం ఏంటంటే
‘కిల్లర్’ సినిమా ట్విస్ట్ చెబితే రూ. కోటి.. కాంటెస్ట్ రూల్స్ ఇవే