హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. డిటైల్స్ ఇవే

ABN , Publish Date - Nov 27 , 2026 | 09:22 PM

గతేడాది సినీ ప్రియులను, యువ ఫిలిం మేకర్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ ఇప్పుడు సీజన్-2తో మరింత గ్రాండ్‌గా అలరించడానికి సిద్ధమైంది.

HISFF Season 2

గతేడాది సినీ ప్రియులను, యువ ఫిలిం మేకర్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ (HISFF) ఇప్పుడు సీజన్-2తో మరింత గ్రాండ్‌గా అలరించడానికి సిద్ధమైంది. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్, తెలంగాణ ప్రభుత్వ యూత్ అడ్వాన్స్‌మెంట్, కల్చర్ అండ్ టూరిజం శాఖల సంయుక్త సహకారంతో 2027 జనవరి 27 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక వేడుక జరగనుంది. ఇటీవల హైదరాబాద్‌లోని పర్యాటక భవనంలో ఈ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ రచయిత, దర్శకుడు, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. యువతరంలో ఉన్న సృజనాత్మకత, క్రియాశీలతలను సరైన దిశలో ఉపయోగించుకోవాలి. వారిలోని ప్రతిభను వెలికితీసేలా షార్ట్ ఫిల్మ్స్ తీయించాలని కోరారు. ఈ కార్యక్రమానికి అండగా నిలుస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ అభినందనీయులని ఆయన కొనియాడారు.


వైఏటీసీ (Youth Advancement, Tourism and Culture) స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ (IAS) ఫెస్టివల్ కార్యక్రమాలకు నాంది పలికిన అనంతరం మాట్లాడుతూ.. ‘హెచ్.ఐ.ఎస్.ఎఫ్.ఎఫ్’ రెండో సీజన్‌గా రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో కీలక బాధ్యత పోషిస్తున్న దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్‌ను అభినందిస్తున్నాను. యువతరాన్ని సంస్కృతికి చేరువ చేస్తూ సామాజిక బాధ్యతను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. టూరిజం ఎండీ క్రాంతి (IAS) మాట్లాడుతూ.. ప్రపంచం నలుమూలల నుంచి ఊహించనన్ని లఘు చిత్రాలు, ప్రఖ్యాత జ్యూరీ సభ్యులతో సీజన్-2 యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకోనుందని పేర్కొన్నారు.


ఫెస్టివల్ నిర్వాహకులు, దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ బాధ్యులు ‘అంకురం’ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ ప్రపంచం ఒక్కటే, మనది ‘వసుధైక కుటుంబం’.. ఎల్లలు, వేర్పాట్లు మానవ సంస్కృతికి విరుద్ధమనే గొప్ప కాన్సెప్ట్‌తో ఈ ఫెస్టివల్ ఏర్పడింది. సీజన్-2 కోసం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రముఖులతో ప్రత్యేక అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేశాం. ఈ వేడుకలో భాగంగా 5 రోజుల పాటు ఫిల్మ్ ఎక్స్‌పో కూడా జరగనుందని వివరించారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ప్రిన్సిపాల్ నందన్ బాబు మాట్లాడుతూ.. తాము నెలకు రెండు షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి విద్యార్థులకు, యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక సందేశం పంపగా, ప్రపంచ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జ్యో పాలో మాచిడో సహా అడ్వైజరీ, జ్యూరీ బోర్డు సభ్యులు తమ శుభాకాంక్షలు, సందేశాలను పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

మోక్షజ్ఞ ఎంట్రీకి మెగా బ్రేక్.. అసలు కారణం ఇదేనా?

‘సమ్మర్ హాలీడేస్’కు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

విరాట్ కర్ణ నెక్ట్స్ ఫిల్మ్‌కు చిరు ఫిల్మ్ టైటిల్.. గ్లింప్స్ అదిరింది

Updated Date - Nov 27 , 2026 | 09:22 PM

డాన్సర్స్ యూనియన్ వివాదంపై సుమలత క్షమాపణలు

Ramayanam: జీతం పెంచలేదు.. ఉద్యోగం నుంచి తొలగించారు!

Jagapathi Babu: జగపతిబాబు నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!

చిట్టిబాబు అండ్ ఫ్యామిలీ.. ఓటీటీకి వ‌చ్చేశారు

ఫూలే బయోపిక్.. క‌ల్వ‌కుంట్ల‌ కవిత భావోద్వేగం!