డాన్సర్స్ యూనియన్ వివాదంపై సుమలత క్షమాపణలు

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:29 PM

ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన వివాదంపై డాన్సర్స్ అసోసియేషన్ సుమలత స్పందించారు. ఛాంబర్ సభ్యులకు, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌కు క్షమాపణలు చెబుతూ, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు.

Sumalatha

ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌ లో డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు కొందరు కమిటీ సభ్యులతో వాదోపవాదాలకు దిగారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య, డాన్సర్స్‌ అసోసియేషన్ సుమలత నేతృత్వంలో ఇది జరిగిందని ఫిల్మ్ ఛాంబర్‌ కార్యవర్గ సభ్యులు భావించారు. గతంలోనే సుమలత ఈ విషయమై వివరణ ఇచ్చి, ఛాంబర్‌ కార్యవర్గ సభ్యులకు క్షమాపణలు తెలిపారు. తాజాగా ఈ విషయమై ఆమె ప్రెస్ మీట్‌ ను నిర్వహించి, తన అభిప్రాయాలు తెలిపారు.

సుమలతతో పాటు తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, వైవిఎస్ చౌదరి తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సుమలత ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'మా యూనియన్ లో జరిగిన అవకతవకలపై వివాదం మొదలయ్యింది. మా యూనియన్ కు ఫెడెరేషన్ కూ గొడవలు అయ్యాయి. మా సభ్యుడు నాన్ కో-ఆపరేషన్ అడగటం కోసం ఛాంబర్ మీటింగ్ కు వచ్చాం. ఆ సమయంలో పల్లి కేశవరావు గాకిపై దాడి జరగటం తప్పే. దానికి మనస్పూర్తిగా క్షమాపణాలు. ఈ సందర్భంగా ఛాంబర్ సభ్యులు అందరికీ సారీ చెబుతున్నాం. ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారికి క్షమాపణలు. వ్యక్తిగతంగా ఆయనతో మాకు ఎలాంటి గొడవలు లేవు. అలానే ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో మీటింగ్ జరిగిన టైమ్ లో జరిగిన ఘటనలపై కూడా క్షమాపణలు కోరుతున్నాను. ఇక మీదట ఇలాంటివి రిపీట్ అవకుండా చూసుకుంటాం. బాలకృష్ణ గారి లాంటి పెద్దల వల్లే ఇండస్ట్రీ బాగుంది. వారి గురించి తప్పుగా మాట్లాడే అర్హత, దైర్యం మాకు లేదు. నేను మాట అన్నందుకు బాధపడుతున్నాను. ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలన్నది తెలుసుకున్నాను. మా వివాదాన్ని పరిష్కరించమని చెప్పిన బాలయ్య బాబు కు కృతజ్ఞతలు. ఫెడరేషన్ తో కలిసి పని చేయాలనుకుంటున్నాం' అని అన్నారు.


తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, 'చిత్రపురి హౌసింగ్‌ సొసైటీకి ఫిల్మ్ ఛాంబర్ కు, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్ కు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఫిల్మ్ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్ కు కో-ఆర్డినేషన్ కమిటి ఉంటుంది. దాని వరకే సంబంధం. ఏ యూనియన్ గొడవలను ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చూడదు. ఫెడరేషన్ లోనే యూనియన్ లు ఉంటాయి. సుమలతను రాంగ్ రూట్‌లో తీసుకువెళ్లారు. నాడు దొమ్మి వాతావరణంలో ఛాంబర్ ఈసి మీటింగ్ లోకి చొచ్చుకుని వచ్చారు. అనిల్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటివి మరలా జరిగితే ఉపేక్షించేది లేదు. ఛాంబర్ లో నాటి వివాదంపై, సభ్యులు దీనిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సుమలతకు సమస్య క్లిష్టతరమైంది. అందుకే చివరికి ఆమె తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారు. ఛాంబర్ కు, కౌన్సిల్ కి, ఫెడరెషన్, వ్యక్తిగతంగా అనిల్ గారికి కూడా సుమలత క్షమాపణలు తెలిపేందుకు ముందుకొచ్చారు. క్లోజ్ అయిపోయిందనుకున్న డాన్సర్స్ యూనియన్ వివాదం అనసరంగా మరలా రిపీట్ అయింది.

WhatsApp Image 2026-11-27 at 1.18.27 PM.jpeg

జానీ మాస్టర్ టాలెంట్ కి, స్కిల్స్ కు అవార్డులు రావచ్చు. కానీ అందరు కలిసికట్టుగా ముందుకువెళ్లాలి. ఇది జానీ, సుమలత, డాన్సర్స్ యూనియన్ గొడవ. దీనికి పవన్ కల్యాణ్ జనసేన, టిడిపి, వైసిపి లకు సంబంధం లేదు. టీ కప్పులో తుఫాన్ లాంటి ఇష్యూ అని వెంటనే క్లోజ్ చేయమని, నాడు బాలయ్య బాబు చెప్పటం వల్లే చదలవాడ గారు, నేను ముందుకు వచ్చాం. ఈ వివాదంలో కొందరు తమ వ్యక్తిగత లబ్ది కోసం సుమలతను ముందుకు తోశారు. ఇప్పుడు సుమలత ఆ విషయాలు తెలుసుకుని వ్యక్తిగతంగా‌ క్షమాపణల పత్రం ఇచ్చారు. డాన్సర్స్ యూనియన్ లోని వివాదాన్ని సుమలత వారి యూనియన్ లోనే ఫెడరేషన్ తో కలిసి తేల్చుకోవాలి. ఇకముందు ఛాంబర్ పై సభ్యులపై దాడులు లాంటివి చేస్తే ఐదేళ్ళ పాటు సహాయనిరాకరణ చేస్తాం" అని అన్నారు.

వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ, 'జానీ మాస్టర్ ప్రతిభావంతుడు. అయితే ఫెడరేషన్‌ గౌరవం కాపాడాలి. వాటి పరిమితుల్లో ఉండి వర్క్ చేసుకోవాలి. జానీ ఎదుగుతోన్న టైమ్ లో హర్డిల్స్ వస్తున్నాయి. ఒక నిర్మాతగా, దర్శకుడిగా జానీ మాస్టర్ మరలా అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగాలి' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

విశాల్‌తో.. ఇక సినిమాలు చేయను! మిష్కిన్ సంచలన వ్యాఖ్య‌లు!

దర్శకుడిగా మారుతున్న గీత రచయిత కళ్యాణ చక్రవర్తి

ఒకరు శ్రీకాళహస్తిలో.. మరొకరు తిరుమలలో.. ఆలయాల బాట పట్టిన స్టార్స్!

Updated Date - Nov 27 , 2026 | 02:34 PM