బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల పెళ్లి ఫొటోలు చూశారా?

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:26 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం తిరుమలలో శాస్త్రోక్తంగా, ఎంతో వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Sreenivasakavyanam

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), కావ్య రెడ్డి (Kavya Reddy)ల వివాహం తిరుమలలో శాస్త్రోక్తంగా, ఎంతో వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తిరుమలలోని కర్ణాటక భవన్ వేదికగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య.. #శ్రీనివాసకావ్యాణం (Sreenivasakavyanam) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

Sreenivasakavyanam

పవిత్ర కొండల ఆధ్యాత్మిక శక్తి మధ్య జరిగిన ఈ వేడుక ప్రేమ, సంస్కృతి, కుటుంబ అనుబంధాల కలయికగా ఎంతో వైభవంగా జరిగింది. సనాతన ధర్మం ప్రకారం శాస్త్రోక్తంగా సాగిన ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాల వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పురాతన ఆచారాలను పాటిస్తూనే, ఆధునిక అభిరుచులకు అనుగుణంగా ఎంతో ప్రశాంతంగా, వేడుకగా ఈ కళ్యాణాన్ని జరిపించారు.


Sreenivasakavyanam

ఈ వివాహ వేడుక కోసం ప్రముఖ డిజైనర్ శ్రావణ్ కుమార్ వధూవరులకు ప్రత్యేకమైన వస్త్రాలను రూపొందించారు. సంప్రదాయబద్ధంగా ఉన్న ఈ ఫొటోలలో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యలు ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. కావ్య భారీ అలంకరణలతో కూడిన చీర, ఆభరణాలలో మెరిసిపోతుండగా.. శ్రీనివాస్ సంప్రదాయ దుస్తులలో క్లాసిక్ లుక్‌లో ఆకట్టుకున్నారు. దేవాలయ ప్రాంగణాన్ని తలపించే అలంకరణల మధ్య వారి ముఖాల్లోని ఆనందం ఈ వేడుకను మరింత అర్థవంతంగా మార్చింది.

Sreenivasakavyanam

కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుక ఎంతో ఘనంగా ముగిసింది. ఆశీర్వాదాలు, సంప్రదాయాల మధ్య ఈ జంట తమ నూతన జీవితాన్ని ప్రారంభించింది.


Sreenivasakavyanam

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల వివాహ వేడుకకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ జరగనుంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులెందరో ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ రిసెప్షన్‌ను భారీగా నిర్వహించేందుకు బెల్లంకొండ ఫ్యామిలీ (Bellamkonda Family) అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

Sreenivasakavyanam

ఇవి కూడా చదవండి:

ప్రేమలో పూజా హెగ్డే.. కుర్రాడు కత్తిలా ఉన్నాడుగా!

‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Sreenivasakavyanam

Updated Date - Apr 30 , 2026 | 03:26 PM

Bellamkonda Sai Srinivas: అమ్మాయి అదృశ్యం వెనుక..?

Bellamkonda Sreenivas: ఈసారి మంచి కథా బలం ఉన్న సినిమాతో వస్తున్నా..

Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ హీరో.. ఈ ఏడాది ఫుల్ బిజీ

Bellamkonda Sai Srinivasu: అనుపమాతో రెండోసారి.. విభిన్న కథతో

మంచి మాస్‌ రోల్‌ చేశాను