సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చంద్రబాబుకు విషెస్.. బండ్లన్న మార్క్ ట్వీట్ వైరల్!

ABN, Publish Date - Apr 20 , 2026 | 06:45 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే కాదు.. బండ్లన్నకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరు వినిపించినా పూనకాలు వచ్చేస్తాయి. ఆ విషయం ఇప్పటికే పలుమార్లు ఆయన నిరూపించారు.

AP CM Chandrababu Naidu and Bandla Ganesh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అంటేనే కాదు.. బండ్లన్న (Bandla Ganesh)కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పేరు వినిపించినా పూనకాలు వచ్చేస్తాయి. ఆ విషయం ఇప్పటికే పలుమార్లు ఆయన నిరూపించారు. ఇటీవల సంకల్పయాత్ర పేరుతో చంద్రబాబుపై ఉన్న ఇష్టాన్ని, ప్రేమను మరోసారి బండ్ల గణేష్ చాటి చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు పుట్టినరోజు (HBDNCBN) అని తెలిస్తే.. కామ్‌గా ఉంటారా? సోషల్ మీడియాలో తనదైన ట్వీట్స్‌తో చెలరేగిపోతున్నారు. ఎప్పుడూ లేని తన కొడుకును కూడా ఈసారి రంగంలోకి దింపారు. ఏపీ సీఎంకు తన కుమారుడు హితేష్ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ట్వీట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి చేసిన ట్వీట్ కూడా ఆయన రీ పోస్ట్ చేస్తూ, ఆ పోస్ట్‌పై కూడా బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు.


ముందుగా బండ్ల గణేష్ తన ట్వీట్‌లో.. ‘‘ఆనాడు సాంకేతిక పరిజ్ఞానంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దిన దార్శనికుడు. ఈనాడు నూతన రాజధాని అమరావతిని నిర్మిస్తూ నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తున్న అపర భగీరథుడు. ఏడు పదుల వయసులో సైతం నిత్య తేజస్సుతో కార్యకర్తలకు, నాయకులకు స్ఫూర్తినిస్తున్న నిండు చంద్రుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మీరు ఇలాగే నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను..’’ అని పేర్కొన్నారు.


నారా భువనేశ్వరి చేసిన ‘‘నా కోసం ఈ రోజు పుట్టావు.. కోట్లాది మంది కోసం జీవించావు.. మీలో సగమై.. మీ కృషిలో భాగమై.. నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు..’’ అనే ట్వీట్‌కు.. ‘‘మీతో పాటు తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం పుట్టిన మహోన్నత వ్యక్తి, మహోన్నత అక్కగా మీరు ఎల్లప్పుడూ ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

అప్పటి వరకూ నాకు విశ్రాంతి లేదు: పవన్ కళ్యాణ్ విష్‌కు చంద్రబాబు స్పందనిదే!

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!

Updated Date - Apr 20 , 2026 | 06:49 PM