Anirudh Ravichander: ఈ యేడాదిలోనే పెళ్ళి!
ABN, Publish Date - May 21 , 2026 | 02:05 PM
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ అధినేత్రి కావ్య మారన్ మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఇదే యేడాది ఈ జంట పెళ్ళి పీటలు ఎక్కబోతోందని కొందరంటున్నారు.
నిప్పు లేకుండా పొగరాదంటారు. కానీ సినిమా వాళ్ళ విషయంలో ఒక్కోసారి నిప్పు లేకుండానే పొగ వస్తుంటుంది. స్టార్స్ లవ్ ఎఫైర్స్ విషయంలో కొన్ని గాలి వార్తలు నెలలు, సంవత్సరాల పాటు మీడియాలో విపరీతంగా నాని ఆ తర్వాత కరిగి పోతుంటాయి. అయితే ఒక్కోసారి ఈ పుకార్లు నిజమౌతుంటాయి. కొంతకాలంగా తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్.ఆర్.హెచ్.) అధినేత్రి కావ్య మారన్ మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ వాటిని ఖండించలేదు.
సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కూతురైన కావ్య న్యూయార్క్ లో ఎంబీయే చేసింది. తండ్రి వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగు పెట్టకుండా, ఎస్.ఆర్.హెచ్. కార్యకలాపాల నిర్వహణలో తలమునకలై ఉంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్... సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఆ సందర్భంగా ఏర్పడిన పరిచయమే వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసిందని కొందరు చెబుతున్నారు. దానికి తోడు మీడియా అంతా కొంతకాలంగా కోడై కూస్తున్నా... వీరు ఖండించకపోవడం కూడా వీరు ప్రేమలో ఉన్నారనడానికి ఓ కారణంగా కొందరు చెబుతున్నారు. మరి కొందరైతే 35 సంవత్సరాల అనిరుధ్, 33 సంవత్సరాల కావ్య ఇంకా ఆలస్యం చేయకుండా ఇదే ఏడాది పెళ్ళి పీటలు ఎక్కేస్తారని జోస్యం చెబుతున్నారు. అంతేకాదు... అతి త్వరలోనే వీరిద్దరి వివాహ నిశ్చితార్థానికి సంబంధించిన ప్రకటన కూడా అధికారికంగా వస్తుందని చెబుతున్నారు. మరి అనిరుధ్, కావ్య తమ మనసులోని మాటను ఎప్పుడు బయట పెడతారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!
Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!
యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!
నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల