Spider Man Brand New Day: ప్రపంచం కంటే.. ఒకరోజు ముందే భారత్‌లో విడుదల
ABN, Publish Date - Jun 14 , 2026 | 06:26 PM
టామ్ హ్యాలెండ్, జెండయా నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider Man Brand New Day) ఒకటి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ సినిమా. అయితే ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులను ఒకరోజు ముందుగానే, జూలై 30న పలకరించనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోనీ ఎంటర్టైన్‌మెంట్స్ (Sony Entertainment) వెల్లడించింది.
టామ్ హ్యాలెండ్ (Tom Holland), జెండయా (Zendaya) ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాకు డిస్టిన్ డేనియల్ క్రెటన్ (Destin Daniel Cretton) దర్శకత్వం వహించారు. ఈ ఫ్రాంచైజీలో గత చిత్రం ‘స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్’ (Spider Man No Way Home)లో పీటర్ పార్కర్ (Peter Parker) తన జ్ఞాపకాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ సినిమా కథాంశం ఉండనుంది.
ఇవి కూడా చదవండి:
దిశా పటానీ ఇదేం అరాచకం.. ఏం పెట్టి పెంచుతున్నావ్ తల్లో!
‘ఫౌజీ’ రిలీజ్ ప్లాన్ మారిందా! అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా?
వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!