రంభలో ఆ జోష్ ఇంకా తగ్గలేదే.. తలకు టవల్‌తో ఫుల్ ఎనర్జీ డ్యాన్స్!
ABN, Publish Date - Sep 01 , 2026 | 07:59 AM
90sలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగారు.
90sలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ (Rambha) ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగారు. అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తళుక్కుమన్నారు. దాదాపు 17 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాల్లో జీవిస్తున్నారు. తాజాగా రంభకు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన సమయంలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తలకు టవల్ చుట్టుకుని, ఫుల్ ఎనర్జీతో బెల్లీ డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు కూడా గంతులు వేస్తూ సందడి చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన అభిమానులు ‘రంభలో ఆ ఎనర్జీ ఇంకా అలాగే ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రంభ వివాహం చేసుకున్నారు. మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత కెనడాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం పిల్లలు, కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులకు దగ్గరవుతూనే ఉన్నారు.ఇటీవల ఓ టీవీ రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించి బుల్లితెరపై కూడా సందడి చేశారు. మరోవైపు రంభ సెకండ్ ఇన్నింగ్స్‌పై కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో ఆమె వెల్లడించారు. ఇప్పుడు వైరల్ అవుతోన్న డాన్స్ వీడియో అందుకు నాంది అని చెబుతున్నారు,
ALSO READ:
నన్ను కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్: దుల్కర్
బాలయ్యతో ‘ఇరుముడి’ దర్శకుడు నిజమేనా..