నిర్మాత సి. కల్యాణ్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:46 PM
టాలీవుడ్ ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత సి. కల్యాణ్ ఇంట్లో పెళ్లి సందడి ఘనంగా జరిగింది. ఆయన కుమారుడు వరుణ్ కుమార్, జ్ఞప్తిల వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్‌లో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
టాలీవుడ్ ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత సి. కల్యాణ్ (C Kalyan) ఇంట్లో పెళ్లి సందడి ఘనంగా జరిగింది. ఆయన కుమారుడు వరుణ్ కుమార్, జ్ఞప్తి (Varun Kumar and Gnapthi)ల వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్‌లో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ దిగ్గజాలు, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ శుభకార్యానికి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, సీనియర్ నటుడు శ్రీకాంత్ తదితర సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రత్యేకంగా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం అతిథులందరూ నిర్మాత సి. కల్యాణ్ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, ఫోటోలు దిగారు. వేడుకకు విచ్చేసిన ప్రముఖులను నిర్మాత సి. కల్యాణ్ స్వయంగా సాదరంగా ఆహ్వానించారు. స్టార్స్ కలయికతో సంధ్య కన్వెన్షన్‌లో జరిగిన ఈ రిసెప్షన్ వేడుక ఎంతో కోలాహలంగా సాగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
అక్టోబర్ నుంచి యంగ్ టైగర్ వేటకు వస్తున్నాడట..
రాజా రవీంద్రతో నేనే దాడి చేయించుకున్నా: కస్తూరి షాకింగ్ కామెంట్స్
మలయాళ బాక్సాఫీస్.. ‘స్టార్ పవర్’ కాదు.. కంటెంటే కింగ్!