Tamannah: ఈ సినిమా గురించి తమన్నా ఏంటి అంత మాట అనేసింది...

ABN , First Publish Date - 2023-06-14T13:07:07+05:30 IST

కొన్ని రోజుల క్రితం విజయ్ వర్మ తో డేటింగ్ లో వున్నాను అని ధృవీకరించి వార్తల్లో వున్న నటి తమన్నా, ఈసారి ఇంకోరకంగా వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చింది. ఒక పెద్ద సినిమా గురించే ఈసారి మాట్లాడింది.

Tamannah: ఈ సినిమా గురించి తమన్నా ఏంటి అంత మాట అనేసింది...
Tamannah Bhatia

తమన్నా భాటియా (TamannahBhatia) ఈమధ్య తరుచూ వార్తల్లో ఉంటోంది. మొన్నీమధ్య తాను విజయ్ వర్మతో (VijayVarma) రిలేషన్ షిప్ లో వున్నాను అని ద్రువీకరించి వార్తల్లో వుంది. ఇప్పుడు ఇంకో సెన్సేషనల్ కామెంట్ చేసి మరీ వార్తలో నిలిచింది. అది కూడా ఆషామాషీ సినిమా మీద కాదు, ఏకంగా అగ్ర దర్శకుడు రాజమౌళి (SSRajamouli) తీసిన 'బాహుబలి' (Baahubali) సినిమా గురించే. ఇందులో ప్రభాస్ (Prabhas), రానా దగ్గుబాటి (RanaDaggubati), అనుష్క శెట్టి (AnushkaShetty), రమ్యకృష్ణ (Ramyakrishna) లతో పాటు తమన్నా కూడా నటించింది. మొదటి పార్టులో ఎక్కువగా కనపడుతుంది తమన్నా, రెండో పార్టులో చిన్నగా కనిపిస్తుంది.

Tamannaah (5).jpg

అయితే ఈ సినిమా గురించి చెపుతూ ఈ సినిమా వలన తనకి పేరు అంతగా రాలేదని చెప్తోంది తమన్నా. ఎందుకంటే ఈ సినిమాలో తనది కేవలం అతిధి పాత్రల చూపించారని అందుకే తనకి మిగతా వాళ్ళకి వచినంతగా పేరు రాలేదని చెప్తోంది. ప్రభాస్, రానా కి మంచి పేరు వచ్చిందని, అయితే వాళ్లిద్దరూ బాగా కష్టపడ్డారు అని, అందుకని మంచి పేరు రావటానికి వాళ్ళు అర్హులని చెప్పింది. అలాగే అనుష్క శెట్టి, రమ్యకృష్ణ లకు కూడా కొంచెం పేరు వచ్చింది అని, కానీ తనకే అసలు పేరు రాలేదని చెప్పింది తమన్నా.

Chiru-and-Tamanna.jpg

ఈ సినిమా వలన తాను క్యాష్ చేసుకోలేకపోయానని చెప్పింది. ఏదైనా సినిమా హిట్ అయితే, ఆ సినిమాలో నటించే కథానాయకులకు మంచి పేరు వస్తుందని చెప్పింది. అంటే అందులో నటించిన కథానాయికలను పట్టించుకోరని పరోక్షంగా చెప్పిన తమన్నా, తెలుగులో ఇప్పుడు చిరంజీవి సరసన 'భోళా శంకర్' లో నటిస్తోంది. అలాగే రజినీకాంత్ 'జైలర్' లో కూడా చేస్తోంది. ఇంకో హిందీ సినిమా, మలయాళం సినిమాలు కూడా లైనప్ లో వున్నాయి. తమన్నాని ఎక్కువగా 'మిల్కీ బ్యూటీ' అని పిలుస్తూ వుంటారు.

Updated Date - 2023-06-14T13:26:09+05:30 IST