Tamannah Bhatia: మొదటి సారి ముద్దు సీన్, ఎవరితో తెలిస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2023-03-15T14:44:35+05:30 IST

తమన్నా భాటియా స్క్రీన్ మీద మొదటి సారి ఒక ముద్దు సన్నివేశం లో నటించింది అని అంటున్నారు. ఈ సన్నివేశం కూడా ఆమె ఎవరితో అయితే ఇప్పుడు తిరుగుతోంది అని అంటున్నారో అతనితోటే అనే వార్త వైరల్ అయింది. ఇక వివరాల్లోకి వెళితే....

Tamannah Bhatia: మొదటి సారి ముద్దు సీన్, ఎవరితో తెలిస్తే షాక్ అవుతారు

ఆమధ్య తమన్నా (Tamannaah Bhatia), విజయ్ వర్మ (Vijay Varma) లు ఇద్దరూ రిలేషన్ షిప్ లో వున్నారన్న వార్త బాగా వైరల్ అయింది కదా. అలాగే కొన్ని నెలల పాటు వాళ్ళు ఇద్దరూ ముద్దు పెట్టుకున్న ఫోటోలు, వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరూ కలిపి ఇప్పుడు ఒక వెబ్ సినిమా చేస్తున్నారట.

అయితే ఇది ఆమధ్య నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన 'లస్ట్ స్టోరీస్' (Lust Stories) అనే దానికి కంటిన్యూ అని అంటున్నారు. దీనికి కూడా నెట్ ఫ్లిక్స్ (Netflix) నిర్మిస్తోంది అని కూడా అంటున్నారు. అంతకు ముందు వచ్చిన 'లస్ట్ స్టోరీస్' పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందులో పెద్ద పెద్ద నటీమణులు రాధికా ఆప్టే (Radhika Apte), భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar), మనీషా కొయిరాలా, కియారా అద్వానీ (Kiara Advani), వికీ కౌశల్ (Vicky Kaushal), నేహా ధూపియా లాంటి వాళ్ళు చేశారు. అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap), కరణ్ జోహార్ (Karan Johar) లాంటి అగ్ర దర్శకులు ఆ 'లస్ట్ స్టోరీస్' లో ఒక్కో ఎపిసోడ్స్ కి దర్శకత్వం వహించారు. అందులో నాలుగు కథలుంటాయి.

tamannaahbhatia2.jpg

కియారా అద్వానీ చాలా బోల్డ్ గా నటించింది అని అందరూ ప్రశంసించారు కూడా. మళ్ళీ ఆ వెబ్ సినిమా కి ఇప్పుడు కంటిన్యూ చేస్తూ 'లస్ట్ స్టోరీస్ 2' (Lust Stories 2) అని వస్తోంది. ఇందులో తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించారు అని తెలిసింది. వీళ్ళిద్దరూ నటించిన దానిలో చాలా సన్నిహితంగా (Intimacy scenes) వుండే సన్నివేశాలు, అలాగే ముద్దు సీన్ (Liplock scenes) లు కూడా ఉన్నాయని తెలిసింది. ఇదే తమన్నాకి స్క్రీన్ మీద మొదటి ముద్దు అని కూడా అంటున్నారు.

tamannaahbhatia4.jpg

ఈ రెండో పార్టు ని సుజయ్ ఘోష్ (Sujoy Ghosh) తీసాడని అంటున్నారు. ఇంతవరకు చూడని తమన్నా ని ఈ వెబ్ సినిమా లో చూడచ్చు అని కూడా ఒక టాక్ నడుస్తోంది. ఇందులో తామన్నహ్ చాలా బోల్డ్ గా, ఎప్పుడూ తను చెయ్యని ఒక పాత్ర చేసిందని కూడా అంటున్నారు. ఇది విడుడుదల అయినప్పుడు చూడాలి ఆమె ఎలా చేసిందో, ఎలా కనిపిస్తుందో.

Updated Date - 2023-03-15T14:45:17+05:30 IST