Alpha: అలియా హైప్ .. శర్వరీని సైడ్ కి నెట్టేస్తారా
ABN, Publish Date - Jun 10 , 2026 | 08:56 PM
ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే ఇద్దరికీ సరైన పాత్ర ఉండాలి.. అంతే టైమ్ కూడా ఉండాలి. ఒకరిని ఎక్కువ.. ఒకరిని తక్కువ చేసి చూపిస్తే అది ట్రోల్స్ కి దారితీస్తోంది.
ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే ఇద్దరికీ సరైన పాత్ర ఉండాలి.. అంతే టైమ్ కూడా ఉండాలి. ఒకరిని ఎక్కువ.. ఒకరిని తక్కువ చేసి చూపిస్తే అది ట్రోల్స్ కి దారితీస్తోంది. ఇప్పుడు అదే ఆల్ఫా విషయంలో జరిగింది. అయితే ఇక్కడ హీరోలు కాదు.. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ అలియా భట్ (Alia Bhatt), శర్వరీ వాఘ్ (Sharvari) హీరోయిన్లుగా శివ్ రావైల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఆల్ఫా. యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లేడీ ఓరియెంటెడ్ స్పై థ్రిల్లర్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఆల్ఫా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. టీజర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర విమర్శలు మరియు చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆల్ఫా టీజర్ హాలీవుడ్ సినిమాల నుండి కాపీ కొట్టినట్లు ఉందంటూ నెటిజన్లు స్క్రీన్ షాట్స్‌తో సహా కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ టీజర్ ఓపెనింగ్ సీన్ 1990 నాటి ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ లా ఫెమ్మె నికితా సినిమాను తలపిస్తోందని కొందరు.. మార్వెల్ పాపులర్ క్యారెక్టర్ బ్లాక్ విడో కు ఇది చీప్ కాపీలా ఉందంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే.. దాదాపు 115 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో శర్వరీకి సంబంధించిన ఒక్క ఫ్రేమ్ కూడా లేకపోవడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు కనీసం రెండో హీరోయిన్ ని ఒక షాట్ లో అయినా చూపించాలి కదా. పోస్టర్లపై శర్వరీ పేరును ప్రస్తావించి, టీజర్‌లో మాత్రం ఆమెను పూర్తిగా పక్కన పెట్టేయడం ఏంటని మండిపడుతున్నారు. పోనీ.. అలియా బర్త్ డే వీడియో అయితే.. ఆమె కోసమే స్పెషల్ గా రెడీ చేశారు అనుకోవడానికి.. అలియా బర్త్ డే కూడా కాదు. అలాంటప్పుడు కేవలం అలియాను హైప్ చేయడానికి శర్వరీని సైడ్ కి నెట్టేస్తారా.. ? అని నెటిజన్స్ అంటున్నారు. లేకపోతే శర్వరీ కూడా కనిపిస్తే.. ఆమె హైలైట్ అవుతుందేమో అని కూత చేసి ఉంటారని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా కనీసం ఒక సింగిల్ షాట్ కూడా శర్వరీది లేకపోవడం.. పాపం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఏమైనా శర్వరీ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారేమో చూడాలి.