నా బాధను ఎలా వ్యక్తంచేయాలో అర్థం కావడం లేదు- శంకర్ మహదేవన్
ABN , Publish Date - Apr 12 , 2026 | 08:22 PM
‘‘ప్రతి భారతీయుడు ఇప్పుడు ఎంతో బాధలో ఉన్నాడు.. ఆమె ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను’’ అని అన్నారు సింగర్, కంపోజర్ శంకర్ మహదేవన్. ఆశా భోంస్లే మృతిపై స్పందిస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
‘‘ప్రతి భారతీయుడు ఇప్పుడు ఎంతో బాధలో ఉన్నాడు.. ఆమె ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను’’ అని అన్నారు సింగర్, కంపోజర్ శంకర్ మహదేవన్. ఆశా భోంస్లే (Asha Bhosle) మృతిపై స్పందిస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘మీరెప్పుడూ మా హృదయాలలో జీవించే ఉంటారు’ అంటూ ఆశా భోంస్లేతో ఉన్న జ్ఞాపకాలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మీడియాకు విడుదల చేసిన వీడియోలో..
‘‘మనందరికీ, అలాగే భారతీయ సంగీత ప్రపంచానికి ఇది చాలా విచారకరమైన రోజు. మా ప్రియతమ ఆశా తాయి ఇక లేరంటే నమ్మలేకపోతున్నాను. ఒక సంగీతకారుడిగా, ఆమె భక్తుడిగా, అలాగే ఆమె కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా నా బాధను ఎలా వ్యక్తంచేయాలో అర్థం కావడం లేదు. ఆమె నాకు సాక్షాత్తూ ఆ సరస్వతీ దేవిలాంటి వారు. ప్రతి భారతీయుడు ఇప్పుడు ఎంతో బాధలో ఉన్నాడు. ఆమె ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కానీ, ఆశా తాయి, ఆమె సంగీతం ఈ భూమిపై మానవజాతి ఉన్నంత కాలం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆమె అందించిన సేవల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.
మన మొబైల్స్‌లో, టీవీల్లో.. ఎక్కడ సంగీతం వినిపించినా ఆమె మనతోనే ఉంటారు. తన అద్భుతమైన గొంతుతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. ప్రస్తుతం మనందరం ఎంతో విషాదంలో ఉన్నాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఎక్కడున్నా మనల్ని దీవిస్తూ ఉండాలని కోరుకుందాం. ఎల్లప్పుడూ ఆమె మాతో పంచుకునే ఆ సానుకూల శక్తి, ఉత్సాహం మాకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వి మిస్ యూ దీదీ.. వి మిస్ యూ’’ అని శంకర్ మహదేవన్ ఎమోషనల్ అయ్యారు. ఒక్క శంకర్ మహదేవన్ మాత్రమే కాదు, సంగీత ప్రపంచానికి చెందిన వారంతా ఆశా భోంస్లే మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మృతి.. ప్రముఖుల నివాళులు
ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!
Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?
Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!