Shah Rukh Khan: 'కింగ్'కు 'అవెంజర్స్: డూమ్స్ డే' దెబ్బ!?
ABN, Publish Date - Jul 14 , 2026 | 12:11 PM
షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా తెరంగేట్రమ్ చేయబోతున్న 'కింగ్' విడుదల మరోసారి వాయిదా పడబోతోందని సమాచారం. ముందు అనుకున్నట్టు ఈ సినిమా క్రిస్మస్ కు రాదని మూవీ టీమ్ చెబుతోంది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్ ను 'కింగ్' సినిమాతో భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలనుకుంటున్నాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇదే యేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల అవుతుందని మేకర్స్ చెప్పారు. కానీ తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే... 'కింగ్' ఆగమనం మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. సినిమా నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విషయంలో జరిగిన ఊహించని జాప్యాల కారణంగా అనుకున్న తేదీకి 'కింగ్' రాదని తెలుస్తోంది. 'కింగ్' సినిమా వాయిదా గురించి అధికారికంగా చెప్పక పోయినా... మూవీ టీమ్ మాత్రం మానసికంగా వచ్చే యేడాది రిలీజ్‌కు సిద్ధమౌతోందని సమాచారం. ఓ వర్గం చెబుతున్న దాని ప్రకారం సినిమా 2027 ప్రారంభంలో జనం ముందుకు వస్తుందట.
ఏప్రిల్ లో జరిగిన గల్ఫ్ వార్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ అన్ని మారిపోయాయని, అందువల్ల అనుకున్న విధంగా షూటింగ్‌ను పూర్తి చేయలేకపోయారని తెలుస్తోంది. దీపికా పదుకుణే షూటింగ్ అయిపోయినప్పటికీ మరికొన్ని ఇతర సన్నివేశాల చిత్రీకరణ బాలెన్స్ ఉందట. అయినా తొలుత డిసెంబర్ 24న విడుదల చేయాలని అనుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా ఇప్పటికే ప్రారంభించారు.
షారూఖ్ కుమార్తె సుహానా దాదాపు నాలుగేళ్ళ క్రితం 'ది ఆర్చీస్'తో ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ఇది ఆమె తొలి థియేట్రికల్ మూవీ కావడంతో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, ప్రశాంతంగా, పకడ్బందీగా, పర్ ఫెక్ట్ ప్లానింగ్‌తో రిలీజ్ చేయాలని బాలీవుడ్ బాద్ షా భావిస్తున్నారట. అందువల్ల మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయడానికి ఆయనేమీ అభ్యంతరం పెట్టడం లేదని తెలిసింది. అంతేకాకుండా డిసెంబర్ 18న కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవెంజర్స్: డూమ్స్ డే' విడుదల అవుతోంది. చూస్తూ చూస్తూ ఆ సినిమా వెనుకే 'కింగ్'ను రిలీజ్ చేయడం కూడా మంచిది కాదని ట్రేడ్ వర్గాలు చెప్పినట్టు సమాచారం. సో... అందుకే షారుఖ్ ఖాన్ కూడా వచ్చే యేడాది విడదలకే మొగ్గు చూపిస్తున్నారట.
ఇవి కూడా చదవండి:
Dhanush: ‘డి-56’ ఆ రోజే అఫీషియల్
Mysskin: విజయ్ సేతుపతి ఒక అగ్నిపర్వతం
Shruti Haasan : శ్రుతి హాసన్ ఓ ఇంటిదయ్యింది