సెట్స్‌పైకి సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి భారీ చిత్రం.. ముంబైలో హంగామా!

ABN , Publish Date - Apr 22 , 2026 | 06:22 PM

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి వచ్చిన అప్డేట్ వైరల్ అవుతోంది. అనౌన్స్‌మెంట్‌తోనే అంచనాలు ఏర్పరచుకున్న ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.

Salman and Vamshi Paidipally Movie Update

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్, బుధవారం (ఏప్రిల్ 22) ముంబైలో ఘనంగా ప్రారంభమైంది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, నయనతారలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో షూటింగ్ స్పాట్‌కు సల్మాన్, నయనతారలు వస్తున్నట్లుగానూ, టీమ్ అంతా హ్యాపీగా షూటింగ్‌ని స్టార్ట్ చేసినట్లుగా తెలియజేశారు.


ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దిల్‌రాజు (Dil Raju) సమర్పణలో శిరీష్, కుల్దీప్ రాథోడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఫీ కాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘SVC63’గా ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకోనుంది. ఇటీవల వచ్చిన అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఆ ప్రకటనతోనే.. భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. హై ఆక్టేన్ యాక్షన్ డ్రామాగా భారీ స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి అద్భుతమైన స్టోరీని రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండటంతో, ఆ పాత్రకు లేడీ సూపర్ స్టార్‌ నయనతార అయితేనే న్యాయం చేయగలదని, ఆమెని సెలక్ట్ చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. అందులోనూ ఇటీవల వచ్చిన ‘జవాన్’తో ఆమె భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.


సల్మాన్ ఖాన్ - నయనతార జంట అనగానే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడింది. సౌత్, నార్త్‌కు చెందిన సినీ దిగ్గజాలు కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్ట్‌‌ను 2027లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, వంశీ పైడిపల్లి స్టైలిష్ మేకింగ్‌తో హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ ఉంటాయని చిత్రబృందం తెలుపుతోంది.

ఇవి కూడా చదవండి:

చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?

అలా విమర్శించే వారిని వదలకండి: చంద్రబాబుకు బండ్ల సూచన

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

Updated Date - Apr 22 , 2026 | 06:41 PM

Salman - Aamir Khan: అతడు ఆగడం లేదు.. మీరు చేయడం లేదు

Salman Khan: 'సల్మాన్' చెప్పింది చేయకపోతే అంతే సంగతులు.. బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

Salman Khan: 17 సెంచరీలు.. బాలీవుడ్ మెగాస్టార్ ఖాతాలో అరుదైన రికార్డ్

Salman Khan: ఆ కారణంతోనే ఇండియన్ రియల్ హీరో పాత్రకు నో

Salman Khan: ఆ స్టార్ హీరోయిన్ నా ఫోటోను బాత్ రూమ్ లో పెట్టుకుంది