Salman - Aamir Khan: అతడు ఆగడం లేదు.. మీరు చేయడం లేదు

ABN , Publish Date - Jun 19 , 2025 | 04:35 PM

ఇద్దరు ఖాన్‌లకు ఆమిర్‌ అంటే అంత గౌరవం. అయితే ఆమిర్‌పై సెటైర్లు, పంచ్‌లు వేస్తూ సరదాగా నవ్వించడంలోను సల్మాన్‌ ముందుంటాడు.

ఆమిర్‌ఖాన్‌(Aamir Khan), సల్మాన్‌ఖాన్‌ల (Salman Khan) మధ్య అనుబంధం గురించి తెలిసిందే. ఒకప్పుడు షారుక్‌ఖాన్‌తో సల్మాన్‌ గొడవల్ని సర్దుమణిగేలా చేయడానికి ఆమిర్‌ మధ్యవర్తిగా వ్యవహరించారు. అందుకే ఇద్దరు ఖాన్‌లకు ఆమిర్‌ అంటే అంత గౌరవం. అయితే ఆమిర్‌పై సెటైర్లు, పంచ్‌లు వేస్తూ సరదాగా నవ్వించడంలోను సల్మాన్‌ ముందుంటాడు.

ఇప్పుడు గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో మరోసారి అందుకు వేదిక అయింది. ఈ నెల 21 రాత్రి ఈ షో టెలికాస్ట్‌ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ తన సహచరుడు, స్నేహితుడు అయిన ఆమిర్‌పై పంచ్‌లు పేల్చాడు. కపిల్‌తో సంభాషణల్లో ఆమిర్‌ ఖాన్‌ కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌ గౌరీ గురించిన ప్రస్తావన వచ్చింది. అలాగే సల్మాన్‌ పెళ్లి గురించి కూడా ప్రశ్న వచ్చింది.




ఆమిర్‌ ఖాన్‌ ఇటీవల తన స్నేహితురాలిని తన  అభిమానులకు పరిచయం చేశాడని కపిల్‌ శర్మ సల్మాన్‌కు చెప్పాడు. 'అతడు ఆగడం లేదు.. మీరు చేసుకొవడం లేదు' అంటూ సల్మాన్‌ని కపిల్‌ ఆటపట్టించాడు. దీనికి సల్మాన్‌ ఆయిర్‌ శైలి వేరు. అతను పెర్‌ఫెక్షనిస్ట్‌. పెళ్లి విషయంలో పెర్‌ఫెక్షన్‌ వచ్చేదాకా’... అంటూ నవ్వేశారు. సల్మాన్‌, కపిల్‌ సంభాషణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
  

Updated Date - Jun 19 , 2025 | 04:37 PM