Salman Khan: ఆ స్టార్ హీరోయిన్ నా ఫోటోను బాత్ రూమ్ లో పెట్టుకుంది

ABN , Publish Date - Jun 25 , 2025 | 05:03 PM

సాధారణంగా అభిమానులు.. తమ అభిమాన హీరోలు, హీరోయిన్ల ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇది అందరికీ తెల్సిందే.

Salman Khan

Salman Khan: సాధారణంగా అభిమానులు.. తమ అభిమాన హీరోలు, హీరోయిన్ల ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇది అందరికీ తెల్సిందే. ఇక ఇంకా పిచ్చి ఉన్నవారు.. టాటూస్ గా ఒంటిపై వేయించుకుంటారు. అయితే అభిమానానికి సెలబ్రిటీలు సైతం అతీతులు కాదని తెలుస్తోంది. ఒక స్టార్ హీరోయిన్.. ఒక స్టార్ హీరో పోస్టర్ ను ఇంట్లో కాదు.. ఏకంగా బాత్ రూమ్ లో అంటించుకుందట. ఆ హీరోయిన్ ఎవరు అంటే బాలీవుడ్ బెబో కరీనా కపూర్ (Kareena Kapoor). ఆమెను అంతలా కట్టిపడేసిన ఆ హీరో ఎవరు అంటే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.


ఖాన్ త్రయంలో ఒకరైన సల్మాన్ తెలుగువారికి కూడా సుపరిచితుడే. ఇండస్ట్రీ మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే సల్లు భాయ్ అని టక్కున చెప్పేస్తారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో ప్రేమలో పడి, బ్రేకప్ అయ్యి.. వారు వేరేవారిని పెళ్లి చేసుకున్నా కూడా సల్మాన్ ఇంకా సింగిల్ గానే మిగిలిపోయాడు. ప్రస్తుతం ఒకపక్క బిగ్ బాస్ షోతో ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా సల్మాన్.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో మూడో సీజన్ కు మొదటి గెస్ట్ గా విచ్చేశాడు. ఈ షోలో కపిల్ శర్మ ప్రేక్షకులను ఎంత నవ్విస్తాడో.. గెస్ట్ ల నుంచి నిజాలను అంత రాబడతాడు. ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్.. ఈ షోకు వచ్చి పరువు పొగట్టుకున్నవాళ్లు ఉన్నారు. పచ్చి నిజాలను బయటపెట్టినవారు ఉన్నారు.


ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా సల్మాన్ ను కపిల్ సర్ప్రైజ్ చేశాడు. అందులో ఇండియాలోనే సల్లు భాయ్ ఫోటో పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారులు ఎలా వ్యాపారం చేస్తున్నారో చూపించాడు. రోడ్డు పక్కన సెలూన్ షాప్, కళ్లజోడు షాప్స్, బనీయన్స్ షాప్ లాంటివి అందులో కనిపించాయి. ఇక ఆ ఫోటోలను చూసిన సల్మాన్ తెగ నవ్వేశాడు. ఆ ఫోటోలు చూశాక తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటనను సల్మాన్ షేర్ చేసుకున్నాడు.


బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్ తన 8 ఏళ్ల వయస్సులో సల్మాన్ పోస్టర్ ను బాత్ రూమ్ లో పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ' కరీనా కపూర్ రూమ్ లో నా పోస్టర్స్ ఉండేవి. చివరికి బాత్ రూమ్ లో కూడా నా పోస్టర్ నే అంటించిందని విన్నాను. ఒకరోజు వారి ఇంటికి వెళ్ళినప్పుడు చూడగా.. నిజంగా బాత్ రూమ్ నా పోస్టర్ కనిపించింది. అప్పుడు తన వయస్సు 8 ఏళ్లు. ఆ తరువాత 15 ఏళ్లు వచ్చేసరికి కరీనా.. నా పోస్టర్ తీసేసి రాహుల్ రాయ్ పోస్టర్ పెట్టుకుంది ' అని చెప్పుకొచ్చాడు.


ఇక కరీనా- సల్మాన్ జంటకు బాలీవుడ్ లో సపారేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరూ కలిసి మూడు సినిమాల్లో నటించారు. చిన్నప్పుడు తన అభిమాన హీరోగా కొలిచిన కరీనా.. పెద్దయ్యాక అతనితోనే రొమాన్స్ చేసింది. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి.

Meena Sagar: బీజేపీలో చేరనున్న నటి మీనా

Updated Date - Jun 25 , 2025 | 05:03 PM