Rashmika Mandanna: రష్మికకు పిచ్చెక్కించేశారట.. పోస్ట్ వైరల్!
ABN, Publish Date - Apr 16 , 2026 | 06:45 PM
విజయ్ దేవరకొండతో పెళ్లి అనంతరం మళ్లీ రష్మిక మందన్నా సినిమా షూటింగ్స్‌తో బిజీ అయ్యారు. రీసెంట్‌గా ‘రణబాలి’ సినిమా షూటింగ్‌లోకి తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి అడుగుపెట్టిన రష్మిక, ప్రస్తుతం బాలీవుడ్‌లో చేస్తున్న ‘కాక్‌టెయిల్ 2’ చిత్ర ప్రమోషన్స్‌ని కూడా మొదలు పెట్టారు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో పెళ్లి అనంతరం మళ్లీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) సినిమా షూటింగ్స్‌తో బిజీ అయ్యారు. రీసెంట్‌గా ‘రణబాలి’ (Ranabaali) సినిమా షూటింగ్‌లోకి తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి అడుగుపెట్టిన రష్మిక, ప్రస్తుతం బాలీవుడ్‌లో చేస్తున్న ‘కాక్‌టెయిల్ 2’ (Cocktail2) చిత్ర ప్రమోషన్స్‌ని కూడా మొదలు పెట్టారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ‘కాక్‌టెయిల్ 2’ సినిమాకు సంబంధించి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ఈ చిత్ర టీమ్ తనకి పిచ్చెక్కించేశారని, అందుకే డ్యాన్స్, అల్లరితో అద్భుతంగా గడిపానంటూ తన పోస్ట్ ద్వారా తెలిపారు.
‘‘దియా డైరీలోని ఒక పేజీ.. మేము ఇటలీలోని సిసిలీలో ‘జబ్ తలక్’ పాటను షూట్ చేశాం. అదంతా సందడి సందడిగా గడిచిపోయింది. షూటింగ్ మధ్యలో అనుకోకుండా డాన్స్ చేయడం, ఆ డాన్స్‌ను ఎంజాయ్ చేస్తూ వైబ్ అవ్వడం, ప్రతి చిన్న విషయానికి విపరీతంగా నవ్వుకోవడం.. వీటన్నిటి మధ్యలోనే మళ్ళీ ఎంతో స్వాగ్‌తో షూట్‌ను పూర్తి చేయడం జరిగింది. దియా తన జీవితంలోని మధుర క్షణాలను గడుపుతోంది. ఆ విషయం సినిమా చూసే సమయంలో అందరికీ అర్థమవుతుంది. ఆ సమయంలో అక్కడ ఎంతో సందడి, అంతకు మించి డాన్స్ ఉంది.
ఇక అల్లీ, కుంజీ గురించి చెప్పాలంటే.. నిజంగానే వారు డాన్స్‌లోనూ, అల్లరిలోనూ బెస్ట్ పార్ట్‌నర్స్. దియా, కునాల్, అల్లీలకు ఒక్కటంటే ఒక్కటి కూడా సీరియస్ మూమెంట్ ఉన్నట్లు నాకు అనిపించలేదు. చివరికి సీరియస్‌గా ఉండాల్సిన సమయంలో కూడా వారంతా సందడి చేస్తూనే ఉన్నారు. మీరంతా పిచ్చోళ్ళు.. నా పిచ్చితనానికి కారణం మీరే. మిమ్మల్ని ఇలాగే ప్రేమిస్తుంటాను! #Cocktail2 జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది’’ అని రష్మిక.. ఈ సాంగ్ షూట్‌కి సంబంధించిన విజువల్స్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో నిజంగానే రష్మిక ఛిల్ అవుతూ కనిపిస్తున్నారు. డ్యాన్స్‌తో పాటు అల్లరి చేస్తూ యమా హుషారుగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!
జూన్‌లోనే ‘పెద్ది’.. అధికారిక ప్రకటన వచ్చేసింది