సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Love and War: రణబీర్‌ కపూర్‌ ఫస్ట్ లుక్‌

ABN, Publish Date - Sep 24 , 2026 | 02:06 PM

లవ్ అండ్ వార్ మూవీ నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ వచ్చింది. ఈ సినిమాను సంజయ్‌ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్నారు.

Ranbir Kapoor

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘లవ్ అండ్‌ వార్’. రణబీర్‌ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై ప్రకటన వెలువడిన దగ్గర నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.


ఇందులో రణ్‌బీర్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో కనిపించే గ్రాండ్ విజువల్స్, రిచ్‌నెస్ ఈ పోస్టర్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రణ్‌బీర్ ఇప్పటివరకు కనిపించని కొత్త అవతార్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. పోస్టర్‌కు జత చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా విజువల్స్‌కు అద్భుతంగా సరిపోయింది. సంగీతం విషయంలో భన్సాలీ మార్క్ మరోసారి కనిపించింది. ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేకర్స్ “వోహ్ రుత్బా, వోహ్ రౌబ్, వోహ్ జునూన్!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ‘లవ్ అండ్‌ వార్’ చిత్రం వచ్చే యేడాది జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

The Paradise Review : ది ప్యారడైజ్‌ మూవీ రివ్యూ

‘జార్జ్ క్రిష్’ బిగ్ అప్‌డేట్.. హీరోయిన్‌గా మిస్ ఇండియా ఫిక్స్

రామ్ చరణ్-సుకుమార్ RC17పై క్రేజీ అప్‌డేట్

హీరోయిన్ కాదు.. రాకాలో రష్మికకు భారీ ట్విస్ట్?

Updated Date - Sep 24 , 2026 | 02:09 PM