‘రామాయణ’లో రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:00 PM

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆధ్యాత్మిక దృశ్యకావ్యం ‘రామాయణ’. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

Ranbir Kapoor Roles in Ramayana

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆధ్యాత్మిక దృశ్యకావ్యం ‘రామాయణ’. నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ భారీ ప్రాజెక్టుపై భారతీయ సినీ అభిమానుల్లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ విశేషాలతో పాటు, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) పోషిస్తోన్న పాత్రల గురించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, ఈ ఎపిక్ డ్రామాలో రణబీర్ కపూర్ ఒక్క పాత్రలో కాదు.. ఏకంగా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.


రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా అలరించడమే కాకుండా, విష్ణుమూర్తి మరొక అవతారమైన పరుశురాముడి పాత్రలోనూ కనిపించబోతుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. సనాతన ధర్మంలో మహావిష్ణువు దశావతారాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులో పరశురాముడు (Parashurama), శ్రీరాముడు (Sri Rama) ఎంతో ప్రాముఖ్యత కలిగిన అవతారాలు. ఈ రెండు శక్తివంతమైన పాత్రలను ఒకే నటుడు తెరపై పండించడం సినీ చరిత్రలోనే అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఒకే సినిమాలో విష్ణుమూర్తి రెండు అవతారాలను రణబీర్ కపూర్ పోషిస్తుండటం మరింత విశేషమనే చెప్పుకోవాలి. శ్రీరాముడి పాత్రలో శాంతం, ధర్మం, గంభీరత ఉంటే.. పరశురాముడి పాత్రలో రౌద్రం, తీవ్రత, ఉగ్రరూపం కనిపిస్తాయి. ఒకే సినిమాలో పరస్పరం భిన్నమైన రెండు ఆధ్యాత్మిక భావోద్వేగాలను రణబీర్ కపూర్ ఎలా పండించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. శ్రీరాముడి పాత్రతో పాటు ఆయన కంటే ముందు అవతారమైన పరశురాముడిగా నటించే అవకాశం రావడం నిజంగా గొప్ప అదృష్టం. రెండు పాత్రల శారీరక భాషతో పాటు వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మికత, భావోద్వేగాలను అర్థం చేసుకుని నటించడం ఒక అద్భుతమైన అనుభవం అని స్పష్టం చేశారు.


ఇక రామాయణంలో సీతా స్వయంవర ఘట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివధనస్సును శ్రీరాముడు విరిచిన తర్వాత పరశురాముడు ప్రత్యక్షమయ్యే సన్నివేశం కథలోనే కీలకమైన మలుపు. ఇప్పుడు రణబీర్ కపూర్ రెండూ పాత్రలను పోషిస్తుండటంతో, శ్రీరాముడు - పరశురాముడు ఎదురెదురుగా నిలిచే సీన్ థియేటర్లలో ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్, యాక్టింగ్ పరంగా ఈ సన్నివేశం వెండితెరపై మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శ్రీరాముడు, పరశురాముడుగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి (Sai Pallavi), రావణాసురుడుగా యష్ (Rocking Star Yash), లక్ష్మణుడుగా రవి దూబే, కైకేయి లారా దత్తా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టును దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మాతలు రూపొందిస్తున్నారు. హాలీవుడ్ అస్కార్ విజేత ‘DNEG’ సంస్థ అందించిన గ్రాఫిక్స్, ఏఆర్ రెహమాన్ తో పాటు, హాలీవుడ్ దిగ్గజం హాన్స్ జిమ్మర్ కాంబినేషన్‌లో వస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇవి కూడా చదవండి:

పావలా శ్యామల గురించి ఘోరంగా రాశారు.. ఇక ఆపండి: కరాటే కళ్యాణి

Spider-Man: Brand New Day Review: స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ

Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ

Updated Date - Jul 30 , 2026 | 06:00 PM